Premaku Jai Movie Pre Release Event: అనిల్ బురగాని, ఆర్ జ్వలిత హీరోహీరోయిన్లుగా మల్లం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రేమకు జై’. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య నిర్మిస్తున్నారు. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకనిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ.. ఓటీటీలు వచ్చాక సినిమా పరిధిలో మార్పు వచ్చింది. చిన్న బడ్జెట్ సినిమానా? భారీ బడ్జెట్ సినిమానా? అని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. కంటెంట్‌తో మెప్పిస్తే చాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాగుంటే ఏ సినిమానైనా బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా కూడా బాగున్న సినిమాల లిస్ట్‌లోకి చేరుతుందని ఆశిస్తున్నాను. ఈ మూవీ పాటలు, ట్రైలర్, పిక్చరైజేషన్ అన్నీ చాలా బాగున్నాయి. దర్శకుడు మల్లం శ్రీనివాస్ ప్రతిభ ఉన్న దర్శకుడిలా ఈ సినిమాతో పేరు పొందుతాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read- Mokshagna Teja: 2025లోనూ మోక్షం లేనట్టేనా?
దర్శకుడు మల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో, ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాము. హీరో అనిల్ బురగాని, హీరోయిన్ జ్వలిత నటనలకు మంచి గుర్తింపు వస్తుంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ విషయంలో నిర్మాత ఎంతో సహకరించి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ‘ప్రేమకు జై’ సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

కో-ప్రొడ్యూసర్ మైలారం రాజు మాట్లాడుతూ.. యూత్‌కు నచ్చే సబ్జెక్ట్ ఇది. అలాగే పేరేంట్స్ కూడా తెలుసుకోవాల్సిన మెసేజ్ ఇది. దర్శకుడు శ్రీనివాస్ చాలా గొప్పగా ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి నెలలో ఈ సినిమాను థియేటర్లలోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను చూసి అందరూ జై కొడతారని ఆశిస్తున్నానని అన్నారు. ఒక మంచి సినిమాలో తమకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఙతలు తెలిపారు హీరోహీరోయిన్లు అనిల్ బురగాని, ఆర్ జ్వలిత. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు అదిరే అభి, నిర్మాత ఎమ్ ఆర్ చౌదరి వడ్లపట్ల, నిర్మాత చందర్ గౌడ్, దర్శకుడు లారెన్స్ వంటి సినీ ప్రముఖులు మాట్లాడుతూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.