3 Roses S2 Trailer: తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో విజయవంతమైన ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురుచూపులకు తెర పడింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ట్రైలర్‌ను ఆహా ఓటీటీ (Aha OTT) విడుదల చేసింది. ఈషా రెబ్బ, రాశి సింగ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి (Director Maruthi) సమర్పించగా, ఎస్.కే.ఎన్. (SKN) నిర్మించారు. కిరణ్ కె కరవల్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ డిసెంబర్ 13 నుంచి ఆహాలో ప్రీమియర్ కానుంది. తాజాగా వదిలిన ట్రైలర్ (3 Roses S2 Trailer)ను గమనిస్తే..
Also Read- Sandeep Raj: నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు.. ‘మోగ్లీ’ దర్శకుడి పోస్ట్ వైరల్!
ముగ్గురు అమ్మాయిలు, మూడు కథనాలు!
‘3 రోజెస్ సీజన్2’ సిరీస్ ప్రధానంగా ఆధునిక యువతులు, వివాహం, కెరీర్, స్వాతంత్ర్యం వంటి విషయాలపై వారి ఆలోచనలు, జీవితంలో వారు ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. సీజన్ 1 కంటే సీజన్ 2లో కాస్త డోస్ పెంచారనేది ఈ ట్రైలర్ స్పష్టం చేసింది. దాదాపు 2 నిమిషాల 38 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్, ముగ్గురు హీరోయిన్ల జీవితాలలో చోటుచేసుకునే సరికొత్త గందరగోళాన్ని చూపించింది. ఈషా రెబ్బ (Eesha Rebba) పాత్రకు వ్యాపారంలో అడ్డంకులు, వ్యక్తిగత జీవితంలో వివాహ ఒత్తిళ్లు చుట్టుముడితే.. రాశి సింగ్ (Rashi Singh) కెరీర్, డేటింగ్ జీవితంలో కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. కుషితా (Kushitha) తన ప్రొఫెషనల్ లైఫ్‌ను మెరుగుపరచుకోవడానికి, ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో కుషిత పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా యూత్ ఆడియెన్స్ కోసం ఆ పాత్రను మలిచినట్లుగా తెలుస్తోంది.
Also Read- Karthi: టఫ్ సినిమాలను చేసినప్పుడే నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లగలం.. కార్తి ఆసక్తికర వ్యాఖ్యలు
సిరీస్‌కు అదే ప్రధాన బలం
ట్రైలర్‌లోని హాస్యభరితమైన సన్నివేశాలు, డబుల్ మీనింగ్ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా, ‘ఫీల్ ది ఫీల్ ఫ్రీడమ్ ప్రాబ్లమ్స్’ వంటి డైలాగులు నేటి తరం అమ్మాయిల మనస్తత్వాన్ని సరదాగా ప్రతిబింబిస్తున్నాయి. దర్శకుడు మారుతి బ్రాండ్ మార్క్ అయిన కామెడీ, వినోదం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. యువతను ఆకట్టుకునేలా, నవ్వు తెప్పించేలా సన్నివేశాలను డిజైన్ చేశారు. ముగ్గురు అమ్మాయిలు ప్రేమ, లైఫ్, కెరీర్ విషయంలో తీసుకునే విభిన్న నిర్ణయాలు, దానివల్ల జరిగే పొరపాట్లు, సరదా గొడవలను ఈ ట్రైలర్‌లో పొందుపరిచారు. మొదటి సీజన్ సక్సెస్ తరువాత, రెండో సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచిందనే చెప్పుకోవాలి. ఈ ముగ్గురు అందమైన యువతులు తమ కష్టాల నుంచి ఎలా బయటపడతారు, వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అనేది డిసెంబర్ 13న ఆహాలో చూడాలి. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

