- కొద్దిపాటి వానలకే భాగ్యనగరం అతలాకుతలం
- ఎక్కడికక్కడ పొంగిపొర్లుతున్న నాలాలు
- ముందున్నది అసలైన వర్షాకాలం
- నాలాలు కబ్జాలవుతున్నా పట్టించుకోని నాటి బీఆర్ఎస్ సర్కార్
- నాలా విస్తరణ పనులన్నీ పెండింగ్
- వాటర్ లాగింగ్ పాయింట్లపై దృష్టి పెట్టని కేసీఆర్ సర్కార్
- గుత్తేదారుల బిల్లులన్నీ పెండింగ్ లోనే
- రేవంత్ సర్కార్ పై పెండింగ్ బిల్లుల భారం
brs neglets stratagic nala development programme for city of Hyderabad:
సమ్మర్ పూర్తికాకుండానే అకాల వర్షాలు భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి,. సిటీలో కొద్దిపాటి వర్షం వస్తే చాలు చిగురుటాకులా వణికిపోతుంది. గత పాలకుల నిర్లక్ష్యానికి ఏటా నష్టపోయేది సామాన్య ప్రజానీకమే. యుద్ధ ప్రాతిపదికన జీహెచ్ ఎంసీ సిబ్బంది పనిచేస్తున్నా..పై అధికారుల నుంచి చివాట్లు తప్పడం లేదు. వచ్చేది వర్షాకాలం కనుక పెండింగ్ పనులు పూర్తిచేయకపోతే సీరియస్ చర్యలుంటాయని హెచ్చరించారు.
37 నాలాల నిర్మాణం
స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రాం ఫేజ్ -1లో భాగంగా కొత్తగా రూ.737.45 కోట్లతో 37 నాలాల నిర్మాణం చేపట్టారు. అయితే 31 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన 6 చోట్ల ఇంకా పెండింగ్ పనులు కొనసాగుతున్నాయి. అవి ఇప్పట్లో పూర్తయ్యేలా లేవు. హిమాయత్ నగర్ రోడ్డు నెంబర్ 14, 18, బేగంపేట్ లోని మయూరీ మార్గ్, కుత్బుల్లాపూర్ లోని ఓక్షిత్ కాలనీ, మల్కాజిగిరి ,సఫిల్ గూడ, నాగోల్ లోని అయ్యప్ప కాలనీ, టోలీచౌకీలోని నదీం కాలనీ, షేక్ పేట్ లోని ఓయూ కాలనీ తదితర ప్రాంతాలలో వరదముంపు పనులు పూర్తికావాల్సి ఉంది. అయితే మూడేళ్ల కిందటే ఎస్ఎన్టీపీ ఫేజ్ -1 పరిధిలోని 37 ప్రాంతాలలో పనులు చేపట్టారు. ఇవి కొనసాగుతుండగానే ఫేజ్-2 లో భాగంగా రూ.1000 కోట్లతో 70 నాలాల పనులు చేపట్టాలని అధికారులు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కు ప్రపోజల్స్ పంపారు. దీనిపై అప్పటి బీఆర్ఎస్ సర్కార్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కేవలం ఫేజ్ -1 పనులతోనే సరిపెట్టింది. అనాడే కేసీఆర్ సర్కార్ అనుమతి ఇచ్చివుంటే నగరానికి ఈ నాడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటున్నారు
వాటర్ లాగింగ్ పాయింట్లపైనా నో ఫోకస్
సిటీలో వానలు పడ్డప్పుడు రోడ్లపై నీళ్లు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్లపై కూడా జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టడంలేదు. రోడ్లపై వరదనీరు చేరినప్పుడే హడావిడి చేస్తుంటారు. ఆ తర్వాత పట్టించుకోవడంలేదు. సిటీలో మొత్తం 122 వాటర్ లాగింగ్ పాయింట్లు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. పంజాగుట్టలోని ఎన్‌ఎఫ్‌సీఎల్ ఫ్లై ఓవర్, రాజ్‌భవన్‌రోడ్, బేగంపేట్‌లోని యాక్సిస్ బ్యాంక్, సైఫాబాద్‌లోని షాదన్ కాలేజ్, నాంపల్లిలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్, సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం జంక్షన్, చాదర్‌ఘాట్ రైల్వే ఆర్‌ఓబీ, బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబర్.12 పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి తదితర ప్రాంతాలు మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్లు కాగా.. వానలు పడ్డ ప్రతిసారి జీహెచ్ఎంసీకి వచ్చే కంప్లయింట్స్ లో సగానికిపైగా ఇలాంటి వాటిపైనే ఉంటాయిఇందులో 23 పాయింట్లలోనే పనులు చేసి శాశ్వత పరిష్కారం చూపినట్టు చెప్పారు.
తేలిగ్గా తీసుకున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపు లేకుండా ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు నుంచి నిధులు విడుదల చేయకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు. వరద ముంపును తేలికగా తీసుకోబట్టే గత జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీఆర్ఎస్ చాలా చోట్ల ఓటమిపాలయింది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపే ఎన్నికల కోడ్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్ లోనూ నాలాల పనులపై బల్దియా ఉన్నతాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఎన్నికలు అయ్యాయి కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. మొత్తానికి సెకండ్ ఫేజ్ కు అనుమతి ఇస్తే.. నిధులు మంజూరైతే వరద ముంపు ప్రాంతాల్లో నాలాలు, బాక్స్ డ్రెయిన్ల నిర్మాణం చేపడితే.. ముంపు వాసులకు విముక్తి లభించనుంది.