- కేసీఆర్ అన్న కొడుకు కబ్జా వివాదం
- హైకోర్టులో కన్నారావుకు చుక్కెదురు
- ఆదిబట్ల పీఎస్‌లో నమోదైన కేసు కొట్టేసేలా ఆదేశాలివ్వాలని క్వాష్ పిటిషన్
- పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం
- ఆదిభట్ల పీఎస్ పరిధిలో 2 ఎకరాల చుట్టూ వివాదం
- ఫెన్సింగ్ తొలగించి షీట్స్‌కు నిప్పు
- కన్నారావు సహా 38 మంది బీఆర్ఎస్ లీడర్లపై కేసులు
Big Shock, KCR’s Son Will Be Thrown In The High Court: కబ్జా కేసులో ఇరుక్కున్న కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆదిభట్ల పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఈ పిటిషన్ వేశారు కన్నారావు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.
అసలేంటీ వివాదం
కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వర్ రావు ఆదిభట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్ట్స్‌కు చెందిన భూమిలో ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జా పెట్టినట్టు కొద్ది రోజుల క్రితం కేసు నమోదైంది. సదరు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ ఫిర్యాదు చేశారు. ఇందులో కన్నారావుతోపాటు 38 మంది బీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్‌మెంట్ ఉండడంతో కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 ఎకరాల భూమికి సంబంధించి ఈ వివాదం రాజుకుంది. ఆ భూమిని కబ్జా చేసేందుకు కన్నారావు ప్రయత్నిస్తున్నారని బాధితుడు వాపోయాడు. ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి హద్దు రాళ్లు పాతినట్టు తెలిపాడు. ఫెన్సింగ్‌కు ఉన్న షీట్స్‌ను తగులబెట్టినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు కన్నారావు సహా మిగిలినవారిపై 307, 447, 427, 436, 148, 149 ఐపీసీ సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Read Also: అంబేద్కర్ ఆత్మ క్షోభిస్తోంది..!
గతంలో తలసానికి వార్నింగ్
గత ప్రభుత్వ హయాంలో కన్నారావు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసేవాడని, దీనికోసం అల్వాల్‌లో ఒక డెన్ ఏర్పాటు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మాజీ నక్సలైట్లతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని సెటిల్మెంట్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను బెదిరించిన ఫోన్ కాల్ ఒకటి అప్పట్లో వైరలైంది. కన్నారావు ఆగడాలను గత ప్రభుత్వంలో పోలీసులు చూసీచూడనట్టు వ్యవహరించారు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిభట్ల పీఎస్‌లో కేసు ఫైల్ అయింది. అయితే, దాన్ని కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా బిగ్ షాక్ తగిలింది. పిటిషన్‌ను కొట్టేసింది న్యాయస్థానం.