Monday, July 1, 2024

Exclusive

Tamanna Bhatia:తమన్నాపై రచ్చ

Bengaluru school introduces lesson on actress Tamannaah Bhatia draws parents ire:

ఒకప్పుడు పురాణ పురుషులు, చారిత్రక యోధులను పాఠ్యాంశాలలో చేర్చడం ఆనవాయితీ. ఇప్పుడు ఏకంగా సినిమా నటులను సైతం పాఠ్యాంశంలో చేర్చడం కామన్ గా మారింది. అయితే టాలీవుడ్ సినీ నటి తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేయడంపై బెంగళూరులో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. హెబ్బాళలోని సింధీ ఉన్నత పాఠశాలపై బాలల హక్కుల రక్షణ సంఘానికి వారు ఫిర్యాదు కూడా చేశారు. విషయం ఏమిటంటే పాఠశాలలోని ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్‌లో సింధీ వ్యక్తుల గురించి అంశాన్ని పొందుపరిచారు. ఇందులో నటి తమన్నా భాటియా, నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ గురించి పాఠ్యాంశంగా చేర్చారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేంటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. పైగా దీనిని వ్యతిరేకించినందుకు తమ పిల్లలకు టీసీ ఇస్తామని పాఠశాల యాజమాన్యం బెదిరిస్తున్నట్లు తెలిపారు.

రచ్చ చేయొద్దు

ఈ విషయాన్ని రచ్చచేయొద్దని తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగిస్తోంది. అదొక పాఠ్యేతర అంశంగా చేర్చినట్లు, అందులో తమన్నా పాఠాలను ఇచ్చినట్లు తెలిపింది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన అనంతరం ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు..అంతేగానీ వేరే ఉద్దేశం లేదని తెలిపింది.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Tollywood Movie: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి..

Rebel Star Prabhas Create New Record From Kalki 2898 Ad Movie: ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద కల్కి 2898 ఏడీ మానియా నడుస్తోంది.థియేటర్‌లో రికార్డుల సునామీని కురిపిస్తోంది. నాగ్‌ అశ్విన్‌...

NBK 109 Movie: ఆ మూవీలో హీరోయిన్‌గా..?

Is She The Heroine In Balayya 109 Movie: డైరెక్టర్ బాబీ కాంబోలో నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన ఎన్బీకే 109 మూవీ తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ రిలీజ్...

Jaanvi Kapoor: పాపం..భామకి కొత్త చిక్కులు

New Complications For Actress Janhvi Kapoor: మనం అనుకున్నవన్నీ జరగవు. జరిగేవాటిని మనం ముందుగానే ఊహించలేం. ఎందుకంటే ఇది జీవితం కాబట్టి. అచ్చం ఓ నటి విషయంలోనూ సేమ్‌ టూ సేమ్‌...