YS Sharmila (image credit:Tweet)
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: పక్క రాష్ట్రాలకు వెళుతున్న బైక్స్, కార్లు.. కారణం చెబుతూ.. షర్మిల సంచలన ట్వీట్..

YS Sharmila: కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో ఉన్న ఏపీ ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఆ రాష్ట్రాలకే వెళుతున్నారట. అంతేకాదు ఆ రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో వాహనదారులు తమ వాహనాలకు ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నారట. ఇప్పటికైనా ఏపీలో పక్క రాష్ట్రాల పెట్రోల్, డీజిల్ ధరలు అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసి ప్రభుత్వాన్ని అక్కడి ధరలు అమలు చేయాలని కోరారు.

షర్మిల ట్వీట్ ఆధారంగా.. రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60పైసలు, డీజిల్ ధర రూ 97.47 పైసలు ఉన్నాయన్నారు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86పైసలు, డీజిల్ ధర రూ.92.39పైసలు ఉన్నాయని, అంటే తమిళనాడుతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు.

కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు, డీజిల్ ధర రూ.88.99పైసలు కాగా, కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువగా ఉందని తెలిపారు. పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు, డీజిల్ ధర రూ. 95.70పైసలు, తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనంగా ఉందని అన్నారు. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం ఇది రాష్ట్ర పరిస్థితి అంటూ ఆమె విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలని, ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట ఉందంటూ దుయ్యబట్టారు. గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరొకటి కాదన్నారు. వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని తెలిపారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందు వరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని విమర్శలు గుప్పించారు.

టిడిపి మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్.. బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారని జగన్ ను విమర్శించారు. 5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేర ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారని, ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50వేల కోట్లు బాదేశారని ట్వీట్ లో తెలిపారు.

Also Read: AP Mega DSC notification: ఏపీ మెగా డీఎస్సీపై లేటెస్ట్ అప్ డేట్.. తీపికబురు చెప్పిన సీఎం చంద్రబాబు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాడు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. ఆ మాట మేరకు లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వెంటనే ధరలు తగ్గించాలని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలని, 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన షర్మిల డిమాండ్ చేశారు.

Just In

01

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!