Sharmila on AP Govt( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Sharmila on AP Govt: ఏపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ షర్మిల

 Sharmila on AP Govt: కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు అని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి పేరుతో సేకరించిన 34 వేల ఎకరాల్లో అభివృద్ధికే దిక్కులేదని, పునరుజ్జీవనం పేరుతో ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు అర్జెంటుగా అవసరం వచ్చిందట అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘అందులో అద్భుత ప్రపంచం కడతాడట. అరచేతిలో వైకుంఠం చూపించడం, ఏఐ పేరుతో గ్రాఫిక్స్ మాయ చేయడం, లేనిది ఉన్నట్లు నమ్మించడం ఒక్క బాబుకే తెలిసిన విద్య. రాజధాని విస్తరణ పేరుతో, విలువైన రైతుల భూములను మళ్లీ తక్కువకే కాజేసి, అనుయాయులకు కట్టబెట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూసే కుట్ర తప్పా మరోటి కాదని మండి పడ్డారు . కూటమి ప్రభుత్వానికి భూదోపిడిపై పెట్టే శ్రద్ధ, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంపై పెట్టడం లేదు. సేకరించిన భూముల్లో ముందు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి అసలే లేదని ”  అన్నారు.

Also Read:  Scariest Sea Animal: మొక్కలా కనిపించే అత్యంత భయంకరమైన ఈ సముద్ర జంతువు గురించి తెలుసా?

ఇంకా ఆమె మాట్లాడుతూ  ”  ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజధాని విస్తరణకు భూములు సేకరించడం తప్పు కాదు. అఖండ అమరావతికి మోకాలడ్డడం మా ఉద్దేశ్యం అంతకన్నా కాదు. కానీ, సేకరించిన 34 వేల ఎకరాల్లో అసలు రాజధాని ఎక్కడ ? కూలిపోయే స్థాయిలో ఉన్న తాత్కాలిక కట్టడాలు, ఎటు చూసినా పాడుబడిన భూములు. ఇదేనా ఆంధ్రుల ఆత్మగౌరవం? సింగపూర్ తలదన్నే ఆకాశ హర్మ్యాలు ఎక్కడ? రాజధానిని ముందు నిలబెట్టకుండా, ఒక రూపం అంటూ తీసుకురాకుండా చిత్రాలతో విచిత్రాలు చేస్తూ, ఇప్పుడే 44 వేల ఎకరాలు అదనంగా గుంజుకోవడం అంటే మరో నాలుగు మండలాల రైతులను మోసం చేస్తున్నట్లు కాదా? మొదటి దశలో సేకరించిన 34 వేల ఎకరాల్లో 2 వేల ఎకరాలు మిగలడం ఏంటి?సీడ్ క్యాపిటల్‌కు పోను మిగిలిన 20 వేలకు పైగా ఎకరాలు, 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు కేటాయించారు?ఏ ప్రాతిపదికన భూములు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 34 వేల ఎకరాలపై వెంటనే పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

అంబేద్కర్ ఆశాజ్యోతి

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సందర్భంగా వైఎస్ షర్మిల నివాళులు అర్పించారు. ‘‘భారత రాజ్యాంగ నిర్మాత, రాజనీతి కోవిదుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం దేశ ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి భారతరత్న డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వాల మేలుకలయిక మన అంబేద్కర్. రాజ్యాంగంలో హక్కులే పునాదులు అని, అన్ని మతాలు, కులాల మధ్య సమానత్వం ఉండాలని, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను, వారి హక్కులను కాపాడాలనేది అంబేద్కర్ ఆశయం. నేడు బీజేపీ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తోంది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి పెద్ద పీట వేస్తోంది. భారత రాజ్యాంగాన్ని మార్చి మనుస్మృతి అమలు చేసే కుట్ర చేస్తోంది. నేడు దేశంలో అమల్లో ఉన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు. నరేంద్ర మోదీ దోస్తులు గౌతమ్ అదానీ, అంబానీతో రాసుకున్న రాజ్యాంగం. లౌకిక వాదాన్ని పక్కన పెట్టి మతం పేరుతో మంటలు రేపుతున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. రక్తపాతం సృష్టించి శవాల మీద రాజకీయం చేస్తున్నారు. నేల,నింగి,నీరు అనే తేడా లేకుండా దేశ సంపద దోచుకుతింటున్నారు. ఈ దేశానికి బీజేపీ నుంచి విముక్తి లభించిన నాడే మహనీయుడు అంబేద్కర్‌కు నిజమైన నివాళులు’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె స్పందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?