YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ (YSRCP) అధినేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు వైసీపీ పార్టీ తెలిపింది. డాక్టర్ల సూచన మేరకు నేడు పులివెందులలో తలపెట్టిన పర్యటనను ఆయన రద్దు చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే జగన్ అనారోగ్యం వార్తలు తెలిసి పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఇదిలా ఉంటే జగన్ పులివెందుల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వైసీపీ ముందే ప్రకటించింది. ఉదయం 10.30 గం.లకు పులివెందుల నుంచి ఇడుపులపాయ చేరుకొని ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొంటారని వైసీపీ తెలిపింది. మధ్యాహ్నం ఒంటిగంటకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్భార్ నిర్వహిస్తారని స్పష్టం చేసింది. రాత్రికి అక్కడి నివాసంలో జగన్ బస చేస్తారని వివరించింది. అయితే జగన్ అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమాలన్నీ రద్దు కావడం గమనార్హం.
పులివెందుల
జ్వరంతో బాధపడుతున్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్
డాక్టర్ల సూచన మేరకు పులివెందుల పర్యటనలో ఇవ్వాళ్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్న వైయస్ జగన్
— YSR Congress Party (@YSRCParty) December 24, 2025
Also Read: Telugu Songs: 2025 టాలీవుడ్ మ్యూజిక్ ధమాకా.. యూట్యూబ్‌ను షేక్ చేసిన టాప్ 10 సాంగ్స్ ఇవే!
మరోవైపు క్రిస్మస్ రోజుకు సంబంధించిన జగన్ షెడ్యూల్ ను సైతం వైసీపీ ప్రకటించింది. దీని ప్రకారం ఉదయం 8.30 గం.లకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొంటారు. అనంతరం 10.30 గం.లకు పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

