CM Chandrababu – YS Jagan: 75 ఏళ్ల వయస్సు ఇది కేవలం నెంబర్ మాత్రమే, ఆయన పరిపాలన దీక్షకు ఇది ఏ మాత్రం అడ్డు కాదు. ఆయన వయస్సును లెక్క చేయరు. ప్రజల కోసం నిరంతరం తపిస్తుంటారు. ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రశంసలతో సోషల్ మీడియా మార్మోగుతోంది. ఇంతకు ఆ పెద్దాయన ఎవరో తెలుసుగా, ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఏ పేజీ చూసినా జన్మదిన శుభాకాంక్షలే. గత రెండు రోజులుగా సీఎం సార్.. హ్యాపీ బర్త్ డే ట్యాగ్ తో తెలుగు తమ్ముళ్లు హోరెత్తిస్తున్నారు. ఈ సంధర్భంగా కొందరు కవితలు రాసి తమ అభిమానాన్ని చాటుకుంటుండగా, మరికొందరు భారీ కేక్ కటింగ్స్, ఆయా జిల్లాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
పార్టీలకు అతీతంగా..
సీఎం చంద్రబాబు పుట్టినరోజు సంధర్భంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు బర్త్ డే విషెస్ చెప్పారు. పీఎం మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇలా అందరూ ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే వైఎస్ షర్మిల సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా ఓ వైపు సోషల్ మీడియాలో మరోవైపు ఏపీ, తెలంగాణ జిల్లాలలో తెలుగు తమ్ముళ్లు తమ అధినాయకుడి బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Also Read: AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. ఒక్క క్లిక్ తో పూర్తి వివరాలు మీకోసమే..
ప్రశాంతంగా సాగాలి.. వైఎస్ జగన్
చంద్రబాబు పుట్టినరోజు సంధర్భంగా మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతమైన ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్షుతో చంద్రబాబు జీవించాలని కోరుకుంటున్నట్లు జగన్ ఆకాంక్షించారు. అయితే నిన్న తన తల్లికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయని జగన్, నేడు సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఫోన్ ద్వారా తన తల్లికి జగన్ బర్త్ డే విషెస్ చెప్పారని, ఇక ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముందని కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ఆ పార్టీ, ఈ పార్టీ అనేది లేకుండా సీఎం చంద్రబాబుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అన్ని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్..
తన జీవితంలో సీఎం చంద్రబాబు ఓ మార్గదర్శకుడే కాదు ఓ వెలుగు అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. రాజకీయాల్లో తన తొలి అడుగు నుంచి ఈ రోజు దాకా – ఆయన చూపిన మార్గం, చెప్పిన మాటలు, చేసిన పనులు ఇవన్నీ తనకు బలాన్నిచ్చాయన్నారు. 75 ఏళ్ళ వయసులో కూడా ఆయనలో ఉన్న ఎనర్జీ చూసి ఆశ్చర్యపోతుంటామని, ఉదయం నిద్రలేచిన వెంటనే రాష్ట్రం గురించే ఆలోచనలు, ప్రజల జీవితాలను ఎలా మెరుగుపరచాలి అన్నదానిపై ఆరాటం, విశ్రాంతి అనే మాట ఆయన డిక్షనరీలో ఉండదన్నారు. ఆయన నాయకత్వంలో పని చేయడం తనకు గర్వకారణమని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన్ని చూసి తాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నానని, మీ ఆరోగ్యం బాగుండాలి చంద్రబాబు గారూ.. ఇంకా చాలా కాలం మాకు మార్గదర్శిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Happy Birthday to @Ncbn Garu! Wishing you a peaceful and healthy long life!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2025