YCP On SI Sudhakar: ఎస్సై సుధాకర్ యాదవ్ పై వైసీపీ రివేంజ్
YCP On SI Sudhakar (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

YCP On SI Sudhakar: ఎస్సై సుధాకర్ యాదవ్ పై వైసీపీ రివేంజ్.. వెలుగులోకి సంచలన నిజాలు!

YCP On SI Sudhakar: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) నిర్వహించిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సహనం కోల్పోయిన జగన్.. పోలీసులను బట్టలూడదీసి కొడతానంటూ సీరియస్ వార్నింగ్ (Jagan Warning) ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై పోలీసు అధికారులు భగ్గముంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ (Sub Inspector Sudhakar Yadav).. జగన్ పై విరుచుకుపడటంతో ఒక్కసారిగా అతడి పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతోంది. దీంతో ఎస్సై సుధాకర్ ను వైసీపీ వర్గాలు టార్గెట్ చేస్తున్నాయి.

ఎస్సైపై నెట్టింట ఫైర్!
రామగిరి ఎస్సై (Ramagiri SI) సుధాకర్.. తమ అధినేతకు కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు (YCP Cader) ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. గతంలో సీఎంగా పనిచేసిన వ్యక్తిని… ఎస్సై ర్యాంక్ వ్యక్తి చురకలు అంటించడమేంటన్న చర్చ ఆ పార్టీ నేతల్లో విస్తృతంగా జరుగుతోంది. ఈ క్రమంలో రామగిరి ఎస్సైని వైసీపీ సోషల్ మీడియా విభాగం టార్గెట్ చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే రామగిరి ఎస్సైపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు విరుచుకుపడుతున్నారు.

టీడీపీతో లింకప్!
ఎస్సై సుధాకర్.. అధికార టీడీపీ సత్సంబంధాలను కలిగి ఉన్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండ చూసుకునే.. మాజీ సీఎం అయిన జగన్ పైనే విమర్శలు చేశారని ఆరోపిస్తున్నారు. అంతటి ఆగకుండా టీడీపీ పెద్దలతో ఎస్సై సుధాకర్ దిగిన ఫొటోలను సైతం నెట్టింట వైరల్ చేస్తున్నారు. మంత్రులు నారా లోకేష్, అచ్చెం నాయుడు, సవిత తదితరులతో సుధాకర్ దిగిన ఫొటోలను నెట్టంట పోస్ట్ చేస్తున్నారు.

ఎస్సైపై సెటైర్లు
నిజాయతీ గల పోలీసు ఆఫీసర్ అంటూ.. సుధాకర్ పై వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో గుంతకల్ టీడీపీ (TDP) టికెట్ కోసం ఆయన బాగా కష్టపడ్డారని ఆరోపిస్తున్నారు. టికెట్ కోసం మైదుకూరు ఎమ్మెల్యే (Mydukur MLA) ను ఎస్సై  కలిసి విజ్ఞప్తి చేసినట్లు నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతో తెలియదు కానీ.. సుధాకర్ ను మాత్రం వైసీపీ ఓ పట్టు పడుతోందన్న ప్రచారం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఊపందుకున్నాయి.

Also Read: SI Sudhakar Yadav: జగన్ కు గోరంట్ల మాధవ్ స్టైల్ వార్నింగ్ ఇచ్చిన ఎస్సై.. మనుషులమేనంటూ..

జగన్ ను ఏమన్నారంటే?
మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ అంటూ సంభోదించిన ఎస్సై సుధాకర్ యాదవ్.. ‘పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావ్.. యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు.. కష్టపడి చదివి సాధించినది, నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి అరటి తొక్క కాదన్నారు. నిజాయితీగా ఉంటాం నిజాయితీగా చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం అంటూనే, జాగ్రత్తగా మాట్లాడాలి’ అంటూ హెచ్చరించారు.

Just In

01

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం