YCP Counter: వల్లభనేని వంశీని విజయవాడ సబ్ జైలులో వైఎస్ జగన్ కలిసిన తర్వాత నుంచి ఏపీలో టీడీపీకి వైసీపీకి మధ్య మాటల యుద్ధం మొదలైంది. జైలు బయట మాట్లాడిన జగన్… వంశీ పైన తప్పుడు కేసులు పెట్టి కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని చెప్పగా దానికి టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ కార్యలయంపై దాడి జరిగింది నిజమని, సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసింది నిజమేనంటూ సాక్షాలుగా వీడియోలు విడుదల చేసింది.
తాజాగా, టీడీపీ విడుదల చేసిన వీడియోలకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ట్రూత్ బాంబ్ అనే పేరుతో ‘ఎక్స్’లో ఓ పోస్టు చేసింది. అందులో కోర్టు ఎదుట సత్యవర్దన్ ఇచ్చిన స్టేట్మ్ంట్ ను బయటపెట్టింది.
💣 Truth Bomb 💣
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
– గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
– కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం
– చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0
— YSR Congress Party (@YSRCParty) February 18, 2025