AP Weather Update (imagecredit:AI0
ఆంధ్రప్రదేశ్

AP Weather Update: ఏపీ ప్రజలకు కూల్ న్యూస్.. రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు!

AP Weather Update: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అన్నారు. వాతావరణ అనిశ్చితి నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళంలో రెండు మూడు చోట్ల భారీ వర్షాలు, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, పల్నాడు, శ్రీసత్యసాయి,చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read: Fraud In Kurnool district: అధిక వడ్డీ ఆశ.. 100 కోట్లకు పైగా మోసం.. ఎక్కడంటే?

ప్రజలు ఎట్టి పరిస్తితిలోను చెట్ల క్రింద నిలబడరాదని అన్నారు. అలాగే రేపు విజయనగరం జిల్లా బాడంగి,బొబ్బిలి,దత్తిరాజేరు,గుర్ల,కొత్తవలస మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి,సీతానగరం మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు 40-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, సోమవారం వైఎస్సార్ జిల్లా సిద్ధవటంలో 41.1°C, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 41°C.

నంద్యాల జిల్లా రుద్రవరంలో 40.6°C, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట 40.5°C, విజయనగరం కొత్తవలస, పల్నాడు జిల్లా నరసారావుపేటలో 40.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఆనయ తెలిపారు. ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.

Also Read: స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ