Attack on Temple: అమెరికా(America)లో మరో హిందూ దేవాలయం(Hindu Temple)పై దాడి జరిగింది. కాలిఫోర్నియా(California)లోని చినో హిల్స్‌లో బాప్స్ స్వామినారాయణ్(Swamy Narayan) మందిరంపై దుండగులు గ్రాఫ్ఫిటితో విద్వేష రాతలు రాశారు. ‘‘హిందువులు వెనక్కి వెళ్లిపోవాలి’’ అని మందిరం గోడలపై రాశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలయ అధికారులు నిర్ధారించారు. సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘విద్వేషానికి వ్యతిరేకంగా హిందూ సమాజం దృఢంగా నిలబడుతుంది’’ అంటూ ఎక్స్ వేదికగా ఖండించారు. చినో హిల్స్, దక్షిణ కాలిఫోర్నియాలోని హిందూ సమూహమంతా కలిసికట్టుగా ఇలాంటి విద్వేషాలకు చోటివ్వకూడదని పిలుపునిచ్చింది. మానవత్వం, శాంతి, దయాగుణంతో నడుచుకోవాలని కోరింది. ఐదు నెలల వ్యవధిలో రెండవసారి జరిగిన ఈ విద్వేష ఘటనను భారత ప్రభుత్వం ఖండించింది. ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్టు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి(Executive of External Affairs Ministry) రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) ప్రకటన విడుదల చేశారు. కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడి వార్తలు తమ దృష్టికి వచ్చాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రభుత్వాధికారులను ఆయన కోరారు. హిందూ దేవాలయాలకు తగిన భద్రతను కల్పించాలని కోరారు. గతేడాది సెప్టెంబర్ నెలలో కాలిఫోర్నియాలోని శాఖ్రమెంటోలో ఉన్న బాప్స్ శ్రీ స్వామినారాయణ దేవాలయంపై కూడా ఈ తరహా ఘటన జరిగింది. దుండగులు విద్వేషపూరిత రాతలు రాశారు. అంతకుముందు న్యూయార్క్‌లోని బాప్స్ దేవాలయంపై కూడా ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారు. కాలిఫోర్నియా పౌర హక్కుల విభాగం (సీఆర్‌డీ) రికార్డుల ప్రకారం కాలిఫోర్నియాలో హిందూ వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు 23.3 శాతంగా, యూదు వ్యతిరేక నేరాలు 37 శాతం, ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత నేరాలు 14.6 శాతంగా ఉన్నాయి.
Also Read:
Pune: రోడ్డు మీదే మూత్రం పోశాడు… ఇదేంటని అడిగితే ‘దాన్ని’ చూపిస్తూ గెలి చేశాడు