mlc nagababu
ఆంధ్రప్రదేశ్

MLC Nagababu: నాగబాబుకు మంత్రి పదవి? తల పట్టుకుంటున్న కూటమి?

MLC Nagababu: మెగా బ్రదర్ నాగబాబు జీవితంలో గీటురాయి లాంటి మరో మైలురాయిని చేరుకోబోతున్నారా? కూటమి ప్రభుత్వ(Alliance government) మంత్రి వర్గంలో ఆయనకు స్థానం ఖరారు అయినట్లేనా? అంటే అవుననే సమాధానాలు వ్యక్త మవుతున్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC)గా నాగబాబు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ కోటాలో ఖాళీ అయిన ఐదు స్థానాలకు గాను ఒకటి ఆయనకు దక్కింది. అయితే ఈ ఎమ్మెల్యే కోటాలో గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ఈనెల 29తో ముగుస్తుంది. కాబట్టి ఆ తరువాతే నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక, శాసనమండలిలో నాగబాబు సభ్యుడిగా మారిన నేపథ్యంలో ఆయన మంత్రి(Ministry) పదవికి లైన్ క్లియర్ అయింది. మరి ఏ శాఖను కేటాయిస్తారనే దానిపైనే ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది.

తమ్ముడు గెలుపు కోసం తనవంతుగా..

2024లో ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అలాగే పోటీ చేసిన 21 స్థానాల్లో గెలుపొందిన  జనసేన(Janasena) 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించి చరిత్ర తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ(YCP) పై పోరులో చంద్రబాబుకు చేదోడుగా నిలవడం, కష్టకాలంలో టీడీపీ(TDP)కి అండగా ఉండటం తదితర ఫ్యాక్టర్స్ దృష్ట్యా జనసేనాని పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం(Deputy CM Pawan Kalyan) పదవి దక్కింది. కాగా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి కోసం ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ పరోక్షంగా సాయం అందించారు. ఎన్నికల ముందు ఆయనకు రూ. 5 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.

నాగబాబు మాత్రం పవన్ వెన్నంటే ఉండి పవన్ విజయానికి దోహదపడ్డారు. పార్టీకి అండగా ఉన్నారు. ముఖ్యంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో కూడా నాగబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. జనసేన గెలుపులో చంద్రునికో నూలు పోగులా తాను కూడా సాయం చేశానన్నారు.

ఇక, కూటమి ప్రభుత్వ ఏర్పడిన నాటి నుంచే నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై చర్చలు జరుగుతున్నాయి. శాసనసభలో గానీ మండలిలో గానీ సభ్యత్వం లేకపోవడంతో ఆయనకు ముందే ఇవ్వడం కుదరలేదు. ఎన్నికల సమయంలో అనకాపల్లి నుంచి ఏంపీగా పోటీ చేస్తారని భావించారు కానీ అది బీజేపీకి వెళ్లడం ద్వారా మిస్సయింది.

అనంతర రాజ్యసభకు వెళ్తారని అనుకున్నప్పటికీ అక్కడ సర్ధుకుపోవాల్సి వచ్చింది. ఆ తరువాత నామినేషన్ పోస్టులు ఇస్తారని, కార్పోరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అటు సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu), ఇటు డీసీఎం పవన్ ఇద్దరు కూడా ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అని ప్రకటిస్తూ వచ్చారు. చివరికి ఎమ్మెల్యే కోటాలో నాగబాబుకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ద్వారా మార్గాన్ని సుగమం చేశారు.

సినిమాటోగ్రఫీ , టూరిజం.. దక్కేది ఏది?

నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనుండటం దాదాపు ఖరారు కావడంతో ఏ శాఖను కేటాయించనున్నారు అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. టూరిజం శాఖను ఇస్తారని ప్రచారం జరుగుతోంది. లేదంటే, మరో జనసేన నేత కందుల దుర్గేష్ ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.  నాగబాబుకు ఏ శాఖకు కేటాయించాలనే దానిపై సోమవారం కేబినెట్ చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మెగా బ్రదర్ కు ఏ శాఖ దక్కనుంది అన్న దానిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇదిలావుంటే… ఇటీవల జనసేన జయకేతనం సభలో నాగబాబు వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పిఠాపురం గెలుపులో కీలక పాత్ర పవన్ ది, ఆ నియోజకవర్గ ప్రజలదే తప్ప వేరే ఎవరిదైనా అనుకుంటే అది వాళ్ల ఖర్మ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మనుద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారని మీడియా కోడై కూసింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఒక రకంగా జనసేన భవిష్యత్తుకు సోపానం కావలసిన ఆ వేదికను, మీటింగ్ ను నాగబాబే చెడగొట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఇస్తే.. నాగబాబు బాగా హ్యాండిల్ చేయగలరా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండటం గమనార్హం.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?