HBD YS Vijayamma: తెలుగు రాష్ట్రాల్లో బలమైన రాజకీయ నేపథ్యమున్న కుటుంబాల్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ఫ్యామిలీ ఒకటి. ఆయన మరణానంతరం తనయుడు వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy).. 2019-24 మధ్య ఏపీకి సీఎంగా సైతం వ్యహరించారు. అయితే అన్న గెలుపునకు ఎంతగానో కృష్టి చేసిన వైఎస్ షర్మిల.. విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తల్లి విజయమ్మ (YS Vijayamma)తోనూ జగన్ కు పడటం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె పుట్టిన రోజు కాగా.. జగన్ నుంచి కనీసం ఒక్క విషెస్ కూడా రాకపోడవం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
షర్మిల విషెస్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా గతంలో తల్లితో దిగిన ఫొటోను ఆమె పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్ డే మా’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అన్ని సమయాల్లో తనకు అండగా ఉంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. దాంతో పాటు బైబిల్ లోని ఓ సందేశాన్ని సైతం షర్మిల.. తన బర్త్ డే పోస్ట్ కు లో చేర్చారు.
వైసీపీ సైలెంట్
ఇదిలా ఉంటే కన్నతల్లి పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఎలాంటి విషెస్ రాకపోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏ ప్రముఖ వ్యక్తి పుట్టిన రోజు వచ్చినా ట్విటర్ వేదికగా వెంటనే విష్ చేసే జగన్.. కన్న తల్లి బర్త్ డే పై మౌనం వహించడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ సోషల్ మీడియా ఖాతాల్లో విజయమ్మ బర్త్ డే పై పెద్దగా హడావిడీ కనిపించడం లేదు. ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల మాత్రం తన ఫేస్ బుక్ ఖాతాలో విజయమ్మకు విషెస్ చెప్పారు. మిగతా నేతలంతా విజయమ్మ బర్త్ డే పై సెలెంట్ కావడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read: Vikarabad district: ఛార్జింగ్ కోసం ఎగబడ్డ జనం.. మీ కష్టం పగోడికి కూడా రాకూడదు!
ఆస్తి తగాదాలే కారణమా!
అయితే వైఎస్ జగన్ కు సోదరి షర్మిలతో ఆస్తి తగాదాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై ఇద్దరు బహిరంగంగానే విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ అంశంలో వైఎస్ విజయమ్మ సైతం కూతురు పక్షాన నిలబడి.. జగన్ కు వ్యతిరేకంగా గతంలో ఓ లేఖను సైతం రిలీజ్ చేశారు. అప్పట్లో ఇది ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కన్న తల్లి తనను విమర్శిస్తూ లేఖ విడుదల చేయడంపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహానికి లోనైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె బర్త్ డే వచ్చినా ఆయన విషెస్ చెప్పలేదని అంతా భావిస్తున్నారు. కాగా గతంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ పనిచేయగా.. ఆ తర్వాత పదవి నుంచి ఆమె తప్పుకున్నారు.