Posani Krishnamurali : నటుడు పోసాని కృష్ణమురళికి కొద్ది సేపటి క్రితమే అస్వస్థత రావడంతో.. హాస్పిటల్ కు (Hospital) తీసుకెళ్లారు పోలీసులు. ఛాతిలో నొప్పి వస్తుందంటూ పోసాని చెప్పడంతో ఆయన్ను స్థానిక గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాజాగా డాక్టర్లు పరీక్షించి పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారని సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి, కడప రిమ్స్ డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేసి ఆయనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. పోసాని అడిగిన అన్ని టెస్టులు తాము చేయించామని.. ఎలాంటి సమస్యలు లేవు కాబట్టి పోసానిని రాజంపేట సబ్ జైలుకు (rajampeta jail) తరలిస్తున్నట్టు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.