Jagan Fans: అభిమానం హద్దులు దాటి… రోడ్డుపై వెళుతున్న జనాలు బెదిరిపోయేలా అత్యుత్సాహం ప్రదర్శించిన పలువురు వైసీపీ కార్యకర్తలు (Jagan Fans) పోలీసుల ట్రీట్‌మెంట్‌ను చవిచూడాల్సి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజవర్గ పరిధిలోని నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో పలువురు జగన్ అభిమానులు ఇటీవల అతిగా ప్రవర్తించారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా, ‘2029లో గంగమ్మ జాతర.. రప్పా రప్పా’’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడితో ఆగకుండా దాదాపుగా రోడ్డు మీదే ఆ ఫ్లెక్సీ వద్ద మేకపోతును బలిచ్చారు. అక్కడితో కూడా ఆగకుండా రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. నరికిన తలను ఫ్లెక్సీకు రుద్దుతూ జగన్ అనుకూల నినాదాలు చేశారు. నడిరోడ్డుపై జంతుబలికి పాల్పడినట్టు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాక తమదైన శైలిలో పోలీసులు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం మెడికల్ చెకప్ కోసం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి స్థానిక పీహెచ్‌సీ వద్దకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నిందిత వ్యక్తులను రోడ్డుపై నడిపించుకొని తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరెస్టైన ఆరుగురు వ్యక్తులూ రోడ్డుపై నడడానికి ఇబ్బందిపడుతూ, కుంటుతూ నడుస్తూ కనిపించారు.
జనాలు భయపడేలా.. పద్ధతి కాదు
ఈ ఘటనను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జంతు బలి ఇవ్వడమే కాకుండా, ఆ రక్తంతో ఫ్లెక్సీలకు అభిషేకం చేయడం వంటి భయానక దృశ్యాలు సామాన్య ప్రజలను, ముఖ్యంగా మహిళలు, పిల్లలను భయాందోళనకు గురిచేశాయనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పైశాచిక చర్యలు చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయనే విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, బహిరంగ ప్రదేశాల్లో జంతువులను బలివ్వడం చట్టం వ్యతిరేకమని న్యాయనిపుణులు చెబుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం ఉండొచ్చు కానీ, అది వికృత చేష్టలకు దారి తీయకూడదంటూ పలువురు విమర్శలు చేశారు. రాజకీయ నాయకులపై అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ, అది ఈ విధంగా మూఢనమ్మకాలకు, జంతు హింసకు లేదా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also- GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!
జగన్ ఫ్యాన్స్ కు పోలీసులు స్ట్రాంగ్ ట్రీట్‌మెంట్
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
2029లో గంగమ్మ జాతర రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీల ఏర్పాటు
జగన్ చిత్రపటం వద్ద మేకపోతును బలి ఇచ్చి రక్తంతో అభిషేకం
ఆరుగురు వ్యక్తులను అదుపులోకి… https://t.co/4tWDP2L6Wu pic.twitter.com/rcACGFpQ7n
— BIG TV Breaking News (@bigtvtelugu) December 27, 2025

