MLC Duvvada Srinivas: ఫార్మ్ హౌస్’లో మద్యం పార్టీ జరుగుతోందన్న సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్వోటీ అధికారులు, మొయినాబాద్ పోలీసుల(Moinabad Police)తో కలిసి దాడి జరిపారు. ఆ సమయంలో విందులో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas) తోపాటు ఆయనతో సహజీవనం చేస్తున్న మాధురి(Madhure)తోపాటు మరో 27మంది ఉన్నారు. తనిఖీలు జరిపిన పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారి పార్థసారథి
మొయినాబాద్ లోని ది పెండెంట్ ఫార్మ్ హౌస్(The Pendant Farm House)లో గురువారం రాత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి పార్థసారథి(Parthasarathi) తన పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి తన స్నేహితుడైన దువ్వాడ శ్రీనివాస్, మాధురితోపాటు మరికొందరిని పిలిచాడు. అంతా కలిసి పెద్ద శబ్ధంతో మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేస్తూ మద్యం సేవిస్తూ పార్టీ విందు చేసుకున్నారు. ఈ మేరకు సమాచారం అందటంతో ఎస్వోటీ అధికారులు, మొయినాబాద్ పోలీసులతో కలిసి ఫార్మ్ హౌస్ పై దాడి చేశారు. సోదాల్లో 10 మద్యం బాటిళ్లు, 7 హుక్కా పాట్లు దొరికాయి.
కేసులు నమొదు..
ఈ క్రమంలో పార్టీ ఏర్పాటు చేసిన పార్థసారథి(Parthasarathi)తోపాటు ఫార్మ్ హౌస్ సూపర్ వైజర్ పై కేసులు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్, మాధురితోపాటు పార్టీలో పాల్గొన్న మిగతా వారికి నోటీసులు ఇచ్చి పంపించారు. మద్యం పార్టీ చేసుకునేందుకు పార్థసారథి ఎక్సయిజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
Also Read: Local Body Elections: నల్గొండ జిల్లా పంచాయతీ పోరులో వర్గ పోరు.. పోలీసుల చొరవతో..!

