CM Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టును ఏదో ప్రాంతానికి పరిమితమైనదిగా చూడకూడదని, తెలుగు జాతికి నెర్వ్ సెంటర్ లాంటిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న టన్నెళ్లను, డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, గోదావరి మిగులు జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: CM Chandrababu Naidu: అక్కడి ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే నేనే కారణం: చంద్రబాబు నాయుడు
రాజకీయాలు తగదు
రెండు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరి కాదని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో దేవాదుల, కల్వకుర్తి, మాధవరెడ్డి లిఫ్ట్ తానే స్టార్ట్ చేశానని గుర్తు చేశారు. ‘‘కృష్ణా డెల్టా ఆధునీకరణతో 20 టీఎంసీల నీటిని పొదుపు చేసి బీమా లిఫ్ట్ పూర్తి చేశాం. ఆర్డీఎస్‌కు నీళ్లు రాకపోతే జూరాల నుంచి లింక్ కెనాల్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 40 వేల ఎకరాలకు నీళ్లందించాం. గోదావరి పైనా తెలంగాణలో అలీసాగర్, గుత్ప ప్రాజెక్టులు చేపట్టాం. హైదరాబాద్ నగరానికి సాగర్ జలాలు అందించాం. తెలుగు జాతి కోసం హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దేవాదుల ప్రాజెక్ట్ విస్తరించుకుంటే ఇబ్బంది లేదు. పోలవరం నీళ్లను మేం వాడుకుంటే అభ్యంతరం వ్యక్తం చేయడం సబబు కాదు. పోలవరం నీళ్లను వినియోగించుకుని కృష్ణా జలాలను పొదుపు చేసుకుంటున్నాం. ఈ పొదుపు చేసిన నీటిని సీమకు మళ్లిస్తున్నాం. అన్నీ కలిసి వస్తే, అవసరమైతే తెలంగాణకు కూడా నీళ్లు ఇవ్వవచ్చు అని చంద్రబాబు వెల్లడించారు.

