pendem dorababu
ఆంధ్రప్రదేశ్

Pendem Dorababu : పవన్ కల్యాణ్‌ తో పెండెం దొరబాబు భేటీ.. జనసేనలో చేరిక..?

Pendem Dorababu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Dorababu) భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసులో పవన్ కల్యాణ్‌ ను కుటుంబ సభ్యులతో దొరబాబు కలిశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు శాలువాతో సన్మానం చేశారు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి చూపించగా పవన్ కల్యాణ్‌ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దొరబాబు 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచే పిఠాపురంలో గెలిచారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు వైసీపీ టికెట్ రాలేదు.

వైసీపీ నుంచి వంగా గీతకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టులో వైసీపీకి రాజీనామా చేశారు. కూటమి పార్టీల్లో చేరుతానని అప్పుడే ప్రకటించారు. కానీ ఏ పార్టీలో చేరేది మాత్రం ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు జనసేనలో చేరబోతున్నారు. ఆయన చేరికతో పిఠాపురంలో పవన్ కు మరింత బలం పెరిగిందని అంటున్నారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ