Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ కేరళకు చేరుకున్నారు. నేటి నుంచి ఆధ్యాత్మిక యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను ఆయన నేటి నుంచి ప్రారంభించారు. ఇప్పటికే ఆయన బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కేరళతో పాటు తమిళనాడులో ప్రముఖ హిందూ ఆలయాలను సందర్శించనున్నారు. హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడిని ఖండించే క్రమంలోనే ఆయన ఈ యాత్ర చేపడుతున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అంశాన్ని ఎత్తుకున్న ఆయన.. దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ఈ యాత్ర చేపడుతున్నారు.
కేరళ కంటే ఎక్కువగా తమిళనాడులోనే ఆయన పర్యటన సాగబోతోంది. అక్కడ ఎక్కువ ఆలయాలను ఆయన సందర్శిస్తారు. అయితే పవన్ కు తమిళ భాష కూడా బాగానే వచ్చు కాబట్టి ఆయన ఏమైనా తమిళ రాజకీయాలపై మాట్లాడితే మాత్రం అది పెద్ద రచ్చకు దారి తీస్తుంది. గతంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్లను పవన్ కల్యాణ్ ఖండించారు. అలాగే కార్తీకి కూడా అప్పట్లో కౌంటర్ ఇచ్చారు. అలాంటి పవన్ ఇప్పుడు స్వయంగా తమిళనాడులో పర్యటించడంతో ఏం జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన కేవలం దర్శించుకుని వస్తారా లేదంటే ఏదైనా కామెంట్ చేస్తారా చూడాలి.