Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలా చెప్పారో లేదో కేవలం 30 నిమిషాల్లో అధికారులు అలర్ట్ అయ్యారు. అందుకు పవన్ సైతం ప్రత్యేకంగా అభినందించి వారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకు పవన్ చెప్పిన ఆ మాటేంటి? అధికారులు ఏం చేశారో తెలుసుకుందాం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన కోసం తమిళనాడు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి ఆలయాలను సందర్శించి భక్తులతో పవన్ మాట్లాడారు. ఆ సంధర్భంగా పవన్ దృష్టికి తమిళులు ఒక సమస్యను తీసుకువచ్చారు. తమిళనాడు ప్రముఖ సుబ్రమణ్యస్వామి పుణ్యక్షేత్రం పళని కి వెళ్ళే తెలుగు భక్తులకు, అలాగే అక్కడి నుండి తిరుమల దేవస్థానానికి విచ్చేసే తమిళ భక్తుల సౌకర్యార్థం తిరుపతి – పళని ప్రత్యేక బస్ సర్వీస్ నడపాలని కోరారు. ఆ సమయంలో తప్పక సమస్యను పరిష్కరిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
దీనితో పవన్ సంబంధిత ఆర్టీసీ అధికారులకు ప్రత్యేక బస్ ఏర్పాటుపై ఆలోచించాలని కోరారు. ఇక అంతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ చెప్పగానే, ఆర్టీసీ అధికారులు సైతం వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ బస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. పవన్ మాట్లాడుతూ.. తాను పళని వెళ్ళినప్పుడు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్ సర్వీస్ తిరుపతి – పళని మధ్య బస్ సౌకర్యం కల్పించాలని అక్కడి వారు కోరారన్నారు. ఈ విషయం చెప్పగానే సహకరించి బస్ సర్వీస్ కు ఆమోదం తెలిపిన రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డికి పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Chikoti Praveen: దోషాన్ని తొలగిస్తే మీరే సీఎం.. చికోటి ప్రవీణ్ కు బంపర్ ఆఫర్.. ఆ తర్వాత?
అలాగే తిరుపతి – పళని మధ్య బస్ సర్వీస్ ఏర్పాటు చేయండని అడగగానే APSRTC MD ద్వారకా తిరుమలరావు 30 నిమిషాల్లో ఆమోదం తెలిపినందుకు అభినందనలు తెలిపారు. మురుగన్ ఆశీస్సులు ఉండటం వల్లనే ఇంత వేగంగా అనుమతులు వచ్చాయని భావిస్తున్నట్లు పవన్ చెప్పారు. ఈ తిరుపతి – పళని మధ్య ఏర్పాటు చేసిన బస్ సర్వీస్ వలన పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల సందర్శనకు దోహదపడుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. నేరుగా బస్ ఏర్పాటు వలన ప్రయాణికులు వేరు వేరు బస్సులు మారాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉపయోగపడుతుందన్నారు.