Council
ఆంధ్రప్రదేశ్

AP Council: మండలిలో వైసీపీ రచ్చ.. ఐదేళ్ల విధ్వంసాన్ని బయటపెట్టిన లోకేష్

AP Council: ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా వైసీపీ (YCP) సభ్యులు రచ్చ చేశారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వరదు కళ్యాణి, బొత్స, చంద్రశేఖర్ రెడ్డి వరుసబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. వీటన్నింటికీ మంత్రి లోకేష్ (Nara Lokesh) స్పందిస్తూ, మాటకు మాట బదులిచ్చారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని వరుదు కల్యాణి ఆరోపించారు. 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్టు చెప్పారని నిలదీశారు. దీనిపై స్పందించిన లోకేష్, ఉద్యోగ అవకాశాలు కల్పించామనే చెప్పామని, నియమించామని చెప్పలేదన్నారు. వైసీపీ సభ్యులు వాస్తవాలు మాట్లాడాలని, వాకౌట్ చేయొద్దని సెటైర్లు వేశారు. గవర్నర్ ప్రసంగం తెలుగు అనువాదంలో తేడా ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పుంటే మార్చుకుంటామని చెప్పండని చెప్పారు.

గవర్నర్ ప్రసంగంలో 2029 వరకు హామీలు ఇచ్చారని చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. 2041 ఎడాది డేటాని పెట్టారని, తలసరి ఆదాయం 23 ఏళ్ల తరవాత రూ.58 లక్షలకు తీసుకువెళతామని చెప్పారని అన్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2047 గురించి ఎందుకు ప్రస్తావన తీసుకొచ్చారని నిలదీశారు. ప్రతి ఏడాది 15 పర్సంట్ పెన్షన్స్ పెంచుతామని చెప్పారని, ఇది సాధ్యం అయ్యేదేనా అని ప్రశ్నించారు. డీఎస్సీపై తొలి సంతకం అని మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ విసీలను మార్చే సంస్కృతి ఎక్కడా లేదన్నారు. అనేకమంది వీసీలను బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, అభ్యంతరం తెలిపారు. దమ్ముంటే దీన్ని నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. గతంలో ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్‌కు తాళం వేసిన చరిత్ర వైసీపీదేనని లోకేష్ విమర్శించారు. వైసీపీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ఎందుకు వీసీల రాజీనామాలు జరిగాయని, దీనిపై కమిటీ వెయ్యాలని చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. వీసీల రాజీనామాలపై సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది.

2019 ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీతో రాష్ట్రం తిరోగమనం వైపు పయనించిందని లోకేష్ అన్నారు. 2014-19 మధ్య ఎన్నో పరిశ్రమలు నెలకొల్పామని, జగన్ పాలనలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని గుర్తు చేశారు. ఒక్క డీఎస్సీ కూడా ఇవ్వలేదన్నారు. ‘‘జే ట్యాక్స్ పేరుతో అక్రమాలు జరిగాయి. విద్యుత్ చార్జీలు పెరిగాయి. విదేశీ పెట్టుబడి దారులు వెనక్కి వెళ్ళిపోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ట్యాక్స్ కట్టే అమర్ రాజా పరిశ్రమను ఇబ్బంది పెట్టారు. లులు మాల్ రాకుండా చేశారు’’ అని విమర్శలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి అనేది జోడెద్దుల మాదిరి ఉండాలన్నారు. రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదని గుర్తు చేశారు. మూడు రాజధానులు అని చెప్పి గందరగోళం సృష్టించారని, అమరావతిలో రైతులపై దాడులు చేశారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి సచివాలయానికి రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చే పరిస్థితి ఉండేదని, అక్రమ కేసులు తప్ప జగన్ పాలనలో జరిగింది ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టామా అని అడిగారు. ‘‘ఇప్పుడు పరదాలు లేవు, అసెంబ్లీ చుట్టూ 80 శాతం సెక్యూరిటీ తగ్గించం. నాపై 23 కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటిముందు ఐదు సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఎలాంటి భద్రత ఉందో అందరూ చూడొచ్చు’’ అని లోకేష్ వ్యాఖ్యానించారు.

Read Also: AP Assembly: వైసీపీ తీరు బాధాకరం.. స్పీకర్ అయ్యన్న గరంగరం

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు