Nadendla Manohar : జనసేన అగ్రనేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్లు చేశారు. ‘చాలా మంది పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను తిడితే ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ పవన్ ను తిడితే హీరోలు కారు జీరోలు అవుతారు. అలా తిట్టినందుకే ఓ వ్యక్తి జైలులో కూర్చున్నాడు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన (Janasena) ఆవిర్భావ సభను విజయవంతం చేయాలంటూ కాకినాడలో సభను నిర్వహించారు. జనసేన ఏపీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇందులో మాట్లాడారు.
ఏపీ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ సభ కాబట్టి.. అందరి చూపు దానిపైనే ఉందన్నారు. ఏపీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం వెనక పవన్ కల్యాణ్ కష్టం ఉందని.. ఆయన్ను ఒక్క మాట అన్నా తాము ఊరుకోబోమన్నారు. పవన్ ను ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కరెక్ట్ కాదన్నారు. అలా తిడితే జీరోలు అయిపోతారంటూ వ్యాఖ్యానించారు.