Lady Aghori (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

Lady Aghori: ఏపీకి వస్తున్నా.. పవర్ చూపిస్తా.. లేడీ అఘోరీ వార్నింగ్

Lady Aghori: వస్తున్నా.. నా మంత్ర శక్తి ఏమిటో చూపిస్తా.. నేనేంటో నాకు తెలుసు.. నన్ను బ్యాడ్ చేయాలని అనుకుంటున్న వారికి ఇదే నా హెచ్చరిక.. నేను వస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ లేడీ అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లేడీ అఘోరీ అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఎవరో చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదోక వివాదంలో ఉండే అఘోరీ చుట్టూ ఇటీవల వివాదాలు కాస్త శృతి మించాయని చెప్పవచ్చు. మంగళగిరికి చెందిన వర్షిణీ అనే బీటెక్ స్టూడెంట్ తాను అఘోరీలా మారతానని లేడీ అఘోరీ వెంట వెళ్లిన విషయం తెలిసిందే. అయితే లేడీ అఘోరీ తమ అమ్మాయిని వశీకరణం చేసిందని, ఆ ప్రభావంతోనే తమ అమ్మాయి తమను కాదని అఘోరీ వెంట వెళ్ళిందని వర్షిణీ తల్లిదండ్రులు ఆరోపించారు.

ఇలా గత కొద్దిరోజులుగా వర్షిణీ కుటుంబ సభ్యులు, లేడీ అఘోరీ వివాదం సాగుతూ ఉంది. ఈ వివాదం ఇరుపక్షాల ఫిర్యాదుల వరకు వెళ్లింది. అయితే వర్షిణీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. గుజరాత్ లో లేడీ అఘోరీతో పాటు ఉన్న వర్షిణీని అక్కడి పోలీసుల ద్వారా ఆమె కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. ప్రస్తుతం వారు ఆమెను ఇంటికి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ సంధర్భంగా పోలీసులకు, లేడీ అఘోరీకి కాస్త వివాదం చెలరేగినట్లు కూడా తెలుస్తోంది.

కాగా బీటెక్ చదువుతున్న యువతిని వెంట తీసుకెళ్లడం, అభ్యంతకర రీతిలో ఫోటోలు దిగడంతో లేడీ అఘోరీపై హిందూ సమాజం కూడా గుర్రుమంది. మహిళలకు అన్యాయం జరిగితే సహించనని చెప్పే లేడీ అఘోరీ, ఓ తల్లికి బిడ్డను వేరు చేయడం అలాగే యువతితో నిలబడి లవ్ సింబల్ వచ్చేలా ఫోజులు ఇవ్వడంతో సర్వత్రా విమర్శలు వినిపించాయి. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు ప్రసారం చేశాయి.

తాజాగా లేడీ అఘోరీ అందరికీ వార్నింగ్ ఇస్తూ.. వీడియోను విడుదల చేశారు. తాను ఆంధ్ర, తెలంగాణకు కాశీ నుండి వస్తున్నానని, రావడం రావడమే తానేంటో, తన పవర్ ఏంటో చూపిస్తానని అన్నారు. తనను బ్యాడ్ గా చూయించే వారికి మంత్ర శుద్ది చేయడమే కాక, వారి నాశనానికి ఎలాంటి క్రియలైనా చేస్తానంటూ అఘోరీ వార్నింగ్ ఇవ్వడం విశేషం. నీచమైన బ్రతుకులు మీవి, అందుకే తనను బ్యాడ్ చేస్తున్నారని, వచ్చి అసలు సంగతి తేల్చుకుంటానని లేడీ అఘోరీ అన్నారు.

Also Read: Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్ వెరీ స్పెషల్.. ఒక్క క్లిక్ తో.. అదేంటో తెలుసుకోండి..

తాను ఇప్పటికీ ఆడపిల్లల రక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడతానని, తనపై వచ్చిన ప్రతి విమర్శకు సమాధానం చెబుతానంటూ లేడీ అఘోరీ వీడియో విడుదల చేశారు. మొత్తం మీద లేడీ అఘోరీ ఆంధ్ర కు వెళ్తారా? వర్షిణీ ఇంటి వద్దకు మళ్లీ వెళ్లే అవకాశం ఉందా? లేక తెలంగాణకే పరిమితమవుతారా అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు