Nara Lokesh – Jr NTR: ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్.. చలనచిత్ర రంగంలో ఒక దేవర. జనతా గ్యారేజ్ సినిమా స్టైల్ లో పొలిటికల్ మెకానిజం చేయాలని ఈ హీరో అభిమానుల కోరిక. కొంత పొలిటికల్ వైపు అడుగులు వేసినా, ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. కేవలం సినిమాలకే పరమితమైనా, పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఫ్యాన్స్ మాత్రం రావాలి రావాలి అంటూ సందడి చేస్తుంటారు.
అంతేకాదు నారా వారికి జూనియర్ ఎన్టీఆర్ కు కాస్త మాట పట్టింపులు ఉన్నాయని అంటుంటారు. అందుకే ఫ్యాన్స్ కాస్త ఉత్సాహంతో టిడిపి సమావేశాల సమయంలో తమ అభిమాన హీరో ఫోటోలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనే మంత్రి నారా లోకేష్ కు ఎదురైంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు హైలెట్ గా మారింది.
దివంగత ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా దివంగత మాజీ ఎంపీ హరికృష్ణ అందరికీ సుపరిచితులే. హరికృష్ణ సినిమా రంగంలోనే కాదు.. పొలిటికల్ పరంగా కూడా సక్సెస్ సాధించారు. తన తాత అంశతో హరికృష్ణకు కలిగిన సంతానమే జూనియర్ ఎన్టీఆర్. హీరోగా జూనియర్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నందమూరి కుటుంబానికి అల్లుడైన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టగా, హరికృష్ణ పలు పదవులు చేపట్టారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి గెలుపు కోసం ప్రచారం చేశారు.
అయితే ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం రెండు కుటుంబాలు ఒక్కటవుతాయి. పార్టీకి ప్రాణం పోస్తారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యారు. అయితే నారా వారికి జూనియర్ ఎన్టీఆర్ కు కాస్త మాట పట్టింపులు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత ఏ కారణమో కానీ జూనియర్ ఎన్టీఆర్ మరెక్కడా పార్టీ కార్యక్రమాల్లో కనిపించలేదు. కేవలం సినిమాలకే పరిమితమై హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ.. ఎందరో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
గత ఎన్నికల సమయంలో ఏపీలోని పలు జిల్లాలలో.. రాజకీయాల్లోకి రావాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేరిట ప్లెక్సీలు వెలిశాయి. ఈ ప్లెక్సీల వెనుక వైసీపీ హస్తం ఉందని జోరుగా ప్రచారం సైతం సాగింది. కానీ జూనియర్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోయారు. ఈ ప్లెక్సీలపై స్పందించనూ లేదు. అయితే టిడిపి సమావేశాలలో అప్పుడప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలు హల్చల్ చేస్తుంటాయి. అలాగే పలువురు, జూనియర్ బోర్డులు చేతబట్టి సీఎం.. సీఎం అంటూ కేకలు వేసిన ఘటనలు ఉన్నాయి.
ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ కు ఎదురైంది. నూజివీడు మండలం సీతారాంపురం వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని లోకేష్ కు చూపించారు.
Also Read: అంతా మీరే చేశారు.. వైసీపీపై లోకేష్ గరంగరం..
లోకేష్ సైతం ఆ ప్లెక్సీని చేతబట్టి అక్కడి అభిమానులను ఉత్తేజపరిచారు. ఎంతైనా ఒకటే కుటుంబం.. అభిమానాలు, ఆప్యాయతలు తప్పక ఉంటాయి. విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం ఉండదని ఈ సంధర్భంగా పలువురు చర్చించుకున్నారు. లోకేష్ వ్యవహరించిన తీరుకు అటు టిడిపి కార్యకర్తలు, జూనియర్ అభిమానులు తెగ సంతోష పడ్డారట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, లోకేష్ చేసిన పనికి అందరూ జేజేలు పలుకుతున్నారు.