Kollu Ravindra | గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ సంచలనం రేపుతోంది. ఏపీ రాజకీయాల్లో ఆయన అరెస్ట్ మీదనే చర్చలు జరుగుతున్నాయి. వంశీ అరెస్ట్ కక్షపూరితం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) తాజాగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘వంశీ తన అనుచరులతో కలిసి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశాడు. ఆయనపై అప్పుడే కేసులు నమోదయ్యాయి. కానీ జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. కక్షపూరితం అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అరెస్ట్ చేసేవాళం’ అంటూ చెప్పుకొచ్చారు.
వైసీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా చాలా రెచ్చిపోయారని.. అలాంటి వారిని జగన్ ప్రోత్సహించినట్టు మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వంలో అలాంటి దాడులు, కక్షపూరిత చర్యలు అస్సలు ఉండబోవన్నారు. అన్నీ చట్ట ప్రకారమే చేస్తామని.. అందులో భాగంగానే అరెస్ట్ చేశారంటూ వివరించారు.