Jagan Vs Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: బాబూ.. ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?

YS Jagan: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకురావ‌డం ద్వారా ఏపీఎండీసీపై ఏడాదికి రూ.235 కోట్ల అధ‌న‌పు భారం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఈ డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి? అని సూటిగా ప్రశ్నించారు. వైసీపీ హ‌యాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఏడాదిలోనే చేశార‌ని దుయ్యబ‌ట్టారు. చంద్రబాబు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ.. బుధవారం కూడా బాండ్లు జారీ చేసి రూ.5,526 కోట్లు అప్పులు చేసిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి? అని డిమాండ్‌ చేశారు.

Read Also- Pawan Kalyan: పురందేశ్వరి తడబడ్డారా.. మనసులో మాట చెప్పారా?

అధిక వడ్డీలకు అప్పులా?
‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు. రూ.5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మళ్ళీ అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. రూ.9000 కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన రూ. 1,91,000 కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా ఏపీఎండీసీ (APMDC) పై ఏడాదికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు (Chandrababu) చెప్పాలి? మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఒక్క​ ఏడాదిలోనే చేశారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.

క్వాష్ పిటిషన్..
ఇదిలా ఉంటే.. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో కుట్రపూరితంగా తన పేరును చేర్చారంటూ జగన్‌ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. నల్లపాడు పోలీసులు నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేయగా ఇవాళ విచారణకు రానుంది. కాగా, జూన్ 18వ తేదీన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ళ గ్రామంలో జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని చీలి సింగయ్య అనే దళితుడు మృతిచెందాడని నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. రాజకీయ ప్రతీకారంతోనే తనపై ఈ కేసు పెట్టారని జగన్‌ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.

Read Also- Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది