Good News AP Fishermen: సముద్ర తీరాల్లో చేపల వేట సాగిస్తూ మత్స్యకారులు (Fishermen) జీవిస్తుంటారు. వారు నిత్యం సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలు పడుతుంటారు. అలా పట్టిన వాటిని విక్రయించి జీవనాన్ని సాగిస్తుంటారు. మత్స్యకారుల్లో చాలా మందికి ఈ చేపల వేటనే ఆధారం. ఒక్కరోజు వేటకు వెళ్లకపోయినా వారిని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. అటువంటిది రెండు నెలలు చేపలకు వెళ్లకుండా ఉంటే వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంటుంది. ఇది గమనించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. గంగపుత్రులకు గుడ్ న్యూస్ చెప్పింది.
26న డబ్బులు జమ
ఏపీలో 2 నెలల పాటు చేపల వేటకు విరామం విధించారు. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకుండా నిషేధం విధించారు. దీంతో వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేట నిషేద సమయంలో మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రకటించింది. ఈ నెల 26వ (April 26th) తేదీన అర్హుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రెట్టింపు చెల్లింపు
గత వైకాపా ప్రభుత్వంతో పోలిస్తే మత్స్యకారులకు అందించే సాయం రెట్టింపు అయ్యిందని చెప్పవచ్చు. గత ప్రభుత్వం వేట నిషేధ సమయంలో జాలర్లకు రూ.10,000 సాయాన్ని అందించింది. దానిని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రూ.20,000లకు పెంచుతూ వారికి శుభవార్త చెప్పింది. దీంతో గంగ పుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఎంతో విలువైన ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
నిషేధం ఏందుకంటే..
ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచే సముద్రంలో చేపల వేటను అధికారులు నిషేధించారు. జూన్ 14వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రోజుల్లో రొయ్యలు, చేపలు తన సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా మత్సకారులకు భవిష్యత్ అవసరాలకు కావాల్సిన మత్స్య సంపద ఈ రెండు నెలల్లో సృష్టించబడతాయి. కాబట్టి ప్రతీ ఏటా ఏప్రిల్ మధ్య నుంచి జూన్ నెల మిడిల్ వరకూ సముద్రంలో చేపల వేటను నిషేదిస్తారు.
Also Read: Match Fixing in IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. తెరపైకి ఫిక్సింగ్.. కథ నడిపింది హైదరాబాదీనే..
అలా చేస్తే కఠిన చర్యలు
వేట నిషేధానికి సంబంధించి ఇప్పటికే అన్ని మత్స్యకార గ్రామాలను ఏపీ ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సముద్రంలోకి వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే ఈ నిషేధం మర, ఇంజిన్ బోట్లపై వేటకు వెళ్లేవారికి మాత్రమే వర్తిస్తుంది. కర్ర తెప్పలపై వేట సాగించేవారికి నిబంధనలు వర్తించవు.