Sri Rama Navami(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Sri Rama Navami: కోదండరాముడికి కళ్లు చెదిరే కానుక.. ఏమిటంటే?

Sri Rama Navami: ఒంటిమిట్ట కోదండ రాముడు శుక్రవారం అంగరంగవైభవంగా, కన్నుల పండువగా కల్యాణం జరుపుకున్న వేళ ఆయనకు మూడు స్వర్ణ కిరీటాలు విరాళాలుగా అందాయి. పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ కిరీటాలను శుక్రవారం దేవాలయానికి అందించారు. సుమారు 7 కేజీల పసిడితో తయారు చేసిన కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు అందజేశారు

ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు కిరీటాలను అలంకరించారు. వజ్రాలు పొదిగిన ఈ కిరీటాల విలువ దాదాపుగా రూ.6.60 కోట్లు ఉంటుంది. కాగా, ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నభూతో నభవిష్యతి అన్నరీతిలో కల్యాణోత్సవం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యి పట్టువస్తాలను సమర్పించారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

 

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు