అమరావతి, స్వేచ్ఛ: RTGS – WhatsApp Governance: ఆర్టీజీఎస్‌లో చేపడుతున్న డేటా అనుసంధాన ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సీఎస్ కె. విజయానంద్ ఆదేశించారు. ఆర్టీజీఎస్ కార్యకలాపాలపై సోమవారం ఆర్టీజీఎస్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. డేటా అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న డేటా లేక్ పనుల ప్రగతి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డేటా అనుసంధాన ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇంకా డేటా అందివ్వని శాఖల ఉన్నతాధికారులతో మాట్లాడి వారి నుంచి కూడా సాధ్యమైనంత త్వరగా డేటా తెప్పించి డేటా లేక్ పనులు వేగవంతం చేయాలన్నారు.
Also read: Zero Poverty P4 policy: సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఇకపై వారికి పండగే..
సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేలా డేటా లేక్ ఏర్పాటు పనులు చేపట్టాలని సూచించారు. వాట్సప్ గవర్నెన్స్ అమలు ప్రగతిపైన కూడా సీఎస్ సమీక్షించారు. వాట్సప్ ద్వారా 200కుపైగా సేవలందించడం శుభపరిణామన్నారు. ప్రజలకు మరింత చేరువగా వాట్సప్ గవర్నెన్స్‌ను తీసుకెళ్లాలని, ప్రజలు సులభంగా ప్రభుత్వం నుంచి అన్ని సేవలను వాట్సాప్ ద్వారా పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది యంత్రాంగం పనితీరు మరింత పెంపొందించేలా ఈ-ఫైళ్ల క్లియరెన్సును మదింపు వేయాలన్నారు.
ఏఐ సౌజన్యంతో..
ఐటీ, రియల్ టైం గవర్నెన్స్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ వాట్సప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సీఎస్‌కు వివరించారు. పౌరులు వాట్సాప్ ద్వారా కేవలం టెక్ట్స్ మెసేజ్ ద్వారానే కాకుండా తమ వాయిస్ మెసేజ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు సౌలభ్యంతో సులభంగా అన్ని సేవలు పొందేలా వాట్సాప్ గవర్నెన్స్‌ను అభివృద్ధి చేస్తున్నామని, ప్రస్తుతం ఇది పరీక్ష దశలో ఉందని, త్వరలోనే దీన్ని పౌరులందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు.
Also read: TTD Budget 2025: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుండి దర్శనం క్షణాల్లోనే..
వాయిస్ ద్వారా పౌరులు ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సేవ కోరుతున్నారో అడిగితే ఏఐ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సేవ పొందే చోటుకు ఆటోమేటిక్‌గా తీసుకెళ్లే సదపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. డేటా అనుసంధాన ప్రక్రియ కూడా వేగవంతం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక చీఫ్ డేటా టెక్నికల్ ఆఫీసర్ (సీడీటీఓ)ను నియమించడం జరిగిందన్నారు. దాదాపుగా అన్ని శాఖలు డేటా లేక్‌తో అనుసంధానం అవుతున్నాయని, కొన్ని శాఖల నుంచి ఇంకా డేటా రావాల్సి ఉందని వాటిపైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/