CM Chandrababu (imagecredit:swetcha)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: వీరయ్య చౌదరి హత్య పై సీఎం సీరియస్.. వదిలే ప్రసక్తే లేదంటూ!

CM Chandrababu: టిడిపి అధికార ప్రతినిధి మాజీ ఎంపిపి వీరయ్యచౌదరి హత్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు వెళ్ళిన చంద్రబాబు వీరయ్య చౌదరి భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరయ్య చౌదరి హత్య ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని చంద్రబాబు హమీ ఇచ్చారు.

దీనికోసం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. వీరయ్య చౌదరి సమర్థ నాయకుడు.. పార్టీకి ఎన్నో సేవలు చేశారు. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే మంచి వ్యక్తి వీరయ్య చౌదరి అని అన్నారు. వీరయ్య చౌదరి కుటుంబాన్ని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటా అని సీఎం హమీ ఇచ్చారు. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నాని, దీనికి గల బాధ్యులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటాం అని ఆయన అన్నారు.

Also Read: Lady Aghori: అరెరె పెద్ద సమస్య వచ్చిందే.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దు అఘోరీ!

ఇలాంటి నేరస్థులు భూమ్మీద ఉండేందుకు అర్హులు కాదని నేరస్థుల గురించి ఎవరికైన సమాచారం ఉంటే ఇవ్వాలని కార్యకర్తలను కోరుతున్నామని నిందితుల గురించి తెలిస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 9121104784కు కాల్ చేసి చెప్పాలని, నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!