CM Chandrababu Warning: ఏం తమాషాలు చేస్తున్నారా? అలా ప్రవర్తిస్తే అదే మీకు చివరి రోజు.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన నైజానికి భిన్నంగా సీఎం చంద్రబాబు తన ప్రసంగం ద్వారా సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పవచ్చు. ఇంతకు ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చారో తెలుసా.. వారికే. ఇంతకు సీఎం వార్నింగ్ ఎవరికో పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఏర్పాటుచేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. పీ4 కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి, ప్రతి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుందని తెలిపారు. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని, వచ్చే విద్యా సంవత్సరంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఎన్నో కార్యక్రమాలకు కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ప్రజలు మంచి చేసే ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టాలని సూచించారు.
ఇక సీఎం ప్రసంగంలో మాస్ మార్నింగ్ ఇవ్వడం విశేషంగా చెప్పవచ్చు. సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం పోస్టులు పెడితే అదే చివరి రోజుగా భావించాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చిందని, ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజుగా భావించాలని హెచ్చరించారు.
ఏపీలో మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని, మహిళలను గౌరవప్రదంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటీవల ఐటిడిపి కిరణ్ అరెస్టు సందర్భంగానే సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేసినట్లు భావించవచ్చు. మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియా పై ఏపీ పోలీస్ ప్రత్యేక నిఘా ఉంచిందని చెప్పవచ్చు.
Also Read: Telangana Earthquake: తెలుగు రాష్ట్రాలకు భూకంప భయమా? ఈ కథనం చదివితే.. తర్వాత?
ఇటీవల పలువురి అరెస్టులను సైతం సాగించిన పోలీసులు, మున్ముందు సైతం మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియాను ఇష్టారీతిన ఉపయోగిస్తున్నారా? మహిళలను ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త మీపై పోలీస్ డేగ కన్ను ఉంది.