CM Chandrababu(image credit:X)
ఆంధ్రప్రదేశ్

CM Chandrababu: పన్ను ఎగవేతలకు ‘ఏఐ’తో చెక్.. రాష్ట్రంలో కొత్త పాలసీ!

CM Chandrababu: రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా సొంతంగా ఆదాయం పెంచుకునేలా, పన్నుల వసూళ్లు పెరిగేలా ఆదాయార్జన శాఖలన్నీ పనిచేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరిన్ని ఆదాయ మార్గాలను వెతకడంతో పాటు, ఎక్కడ ఆదాయం తక్కువుగా నమోదవుతుందో దానికి గల కారణాలను వెతికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పన్నుల చెల్లింపుల దగ్గర నుంచి రశీదులు, నోటీసులు జారీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరగాలని చెప్పారు.

సచివాలయంలో ఆదాయార్జన శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఇచ్చిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా బిల్డర్లు అసలు రిజిస్టర్ కాలేదని ఏఐ గుర్తించిందన్నారు. అయితే, తప్పనిసరిగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రభుత్వం ఎటువంటి ఆమోదాలైనా తెలపాలని అధికారులకు సూచించారు. ‘ పన్ను ఎగవేతదారులను పసిగట్టేందుకు ఏఐని వినియోగించుకోవాలి.

అన్ని ఆదాయార్జన శాఖల్లోనూ ఇదే తరహా ప్రక్రియ అమలు చేసి పకడ్బందీగా పన్ను వసూళ్లు చేయాలి. టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా వ్యాపారులకు పన్ను చెల్లింపులు, అనుమతులు వంటివి సులభతరం అవుతున్నాయనే విషయాన్ని వారికి తెలియజేయాలి. పన్ను చెల్లింపుదారులు, జీఎస్టీ పోర్టల్, ఏపీ రాష్ట్ర డేటా సెంటర్, ఏపీసీటీడీ ఇలా మొత్తం శాఖల సమాచారాన్ని ఏఐతో అనుసంధానించాలి.

Also read: Janasena on Kavitha: పవన్ తో పెట్టుకున్న కవిత.. ఏకిపారేస్తున్న జనసైనికులు.. మరీ ఇంత ఘోరంగానా!

పన్ను చెల్లింపుదారులకు నోటీసుల జారీకి, గ్రీవెన్స్‌లు స్వీకరించడానికి ఏఐని వినియోగించి ప్రభుత్వ యంత్రాంగంలో మరింతం వేగం పెంచవచ్చు. ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యం రూ.1,37,412 కోట్లను 100 శాతం ఆర్జించేలా అన్ని శాఖలు కృషి చేయాలి’ అని చంద్రబాబు చెప్పారు.

సొంత ఆదాయంలో 2.2 శాతం వృద్ధి
‘ 2023-24 ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే 2024-25కి గాను రాష్ట్రానికి సొంతంగా ఆదాయంలో 2.2శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో వృద్ధి 4.1 శాతం పెరగ్గా, పన్నేతర ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. జీఎస్టీలో 4.9శాతం వృద్ధి, ప్రొఫెషనల్ ట్యాక్స్‌లో 15.2శాతం వృద్ధి, ఎక్సైజ్ ఆదాయంలో 24.3 శాతం వృద్ధి నమోదైంది’ అని చంద్రబాబు తెలిపారు.

‘ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన దగ్గర నుంచి ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గతం కన్నా మెరుగుపడింది. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ.4,330 కోట్ల ఆదాయం రాగా, దాదాపు 33 శాతం ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. అలాగే, మున్సిపల్ శాఖలో 2023-24 కంటే 2024-25లో రూ.500 కోట్లకు పైగా ఆదాయం అదనంగా వచ్చింది. పన్నులకు సంబంధించి ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు ఉన్నాయి.

వీటిలో అత్యధికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులకు సంబంధించిన పన్నులు, అలాగే, ఖాళీ స్థలాల పన్నులు అధికంగా వసూలు కావాల్సి ఉన్నాయి. మార్చి నెలలో ప్రకటించిన 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో కేవలం 6 రోజుల్లోనే మొత్తం ఆస్తిపన్నులు రూ.240 కోట్లు వసూలయ్యాయి’ అని సీఎంకు అధికారులు వివరించారు.

అలా అమరావతిలో కొత్త ఇల్లు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం.. తను కూడా రాజధానికి కూతవేటు దూరంలో ఇంటి నిర్మాణానికి తలపెట్టారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌లో బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, నారా లోకేష్‌, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్‌లు వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు.

Also read: Mega DSC AP: ఏపీ మెగా డీఎస్సీపై లేటెస్ట్ అప్‌డేట్!

సచివాలయం వెనుక ఈ9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం జరగనుంది. రాజధాని కోర్ ఏరియాలో వెలగపూడి పరిధిలో సీఎం చంద్రబాబు నివాసం ఉండనుంది. సీఎం తమ ప్రాంతంలో ఇల్లు కట్టు కోవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భూమి పూజ కార్యక్రమం పూర్తయ్యాక చంద్రబాబుకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంటి ప్లాన్ వివరించారు. అధికారిక నివాసం, కాన్ఫరెన్స్‌ హాల్‌కు సంబంధించి చర్చ జరిగింది. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక హంగులతో చంద్రబాబు నివాసం నిర్మాణం జరగనుంది.

ఇల్లు కాదు.. నిబద్ధతకు ప్రతీక
కొత్త ఇంటి శంకుస్థాపన తర్వాత సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ ఇవాళ నాకు, నా కుటుంబానికి ఎంతో భావోద్వేగభరితమైన రోజుగా నిలిచిపోతుంది. కోట్లాది మంది ప్రజల కలల ప్రతిరూపం రాజధాని అమరావతిలో మా కొత్త ఇంటి నిర్మాణానికి మా నాన్న చంద్రబాబు భూమి పూజ చేయడాన్ని ఎంతో గర్వంగా, కృతజ్ఞతా భావంతో వీక్షించాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాన్న ఊహించిన ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించాలన్న కలకు ఇది పునరుజ్జీవనం.

ఈ పవిత్రమైన కార్యక్రమంలో నా తల్లి భువనేశ్వరి, నా శక్తికి మూలస్తంభం నారా బ్రాహ్మణి, నా ముద్దుల కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పాల్గొనడం ఒక దీవెన వంటిది. ఇది మా ఇల్లు మాత్రమే కాదు.. మా నిబద్ధతకు ప్రతీక. అమరావతిని మర్చిపోలేదు. దీన్ని మరింత బలంగా, మరింత పట్టుదలతో, ఎన్నడూ లేనంత మరింత అందంగా పునర్ నిర్మిస్తున్నాం. మన రాజధాని మళ్లీ పునరుజ్జీవం పొందుతోంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి కూడా దూసుకుపోతోంది’ అని లోకేష్ పేర్కొన్నారు.

 

 

Just In

01

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!