Minister Kandula Durgesh: హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ, నిర్మాణ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌కు తరలి రావాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తే సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లు చేసే సంస్థలకు కూడా రాయితీలు ఇస్తామని దుర్గేష్ ప్రకటించారు.
Also Read: Samantha : ఆ పని చేసి కోట్లలో నష్టపోయానంటూ సంచలన కామెంట్స్ చేసిన సమంత
కాగా, ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్ళీ మళ్లీ ‘ఏపీకి సినీ ఇండస్ట్రీ తరలి రావాలి’ అనే పాట వినిబడుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముగ్గురూ కూడా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలి రావాలని కోరుతున్నారు. ఈ ముగ్గురితో తెలుగు సినీ పరిశ్రమకు ఎంత బలమైన అనుబంధం ఉందో అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా, ఇద్దరు మెగా బ్రదర్స్ అధికారంలో, అధికార పార్టీలో ఉన్నారు. అయితే, కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఇంతవరకూ ఒక్కటంటే ఒక్కటీ సంస్థ రాకపోవడం గమనార్హం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
