Chandrababu: ‘ఈ జవాన్ గోడు ఎవరికీ పట్టదా?’ అంటూ ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనానికి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పందన వచ్చింది. ఈ వార్తకు సీఎం చంద్రబాబు స్పందించి.. సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రి నారా లోకేష్, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాలను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్.. జవాన్ తండ్రి బయప్పగారి కృష్ణప్పతో ఫోన్‌లో మాట్లాడారు. వీలైనంత త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని భరోసా ఇచ్చారు. మరోవైపు షాజహాన్ బాషా సైతం ఫోన్‌లో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. దీంతో జవాన్ సమస్యకు అతి త్వరలోనే పరిష్కారం దొరకనుంది.

థ్యాంక్యూ.. థ్యాంక్యూ!
చంద్రబాబు స్పందన, నారా లోకేష్ ఫోన్ కాల్ తర్వాత జవాన్ సోదరుడు ఎక్స్ వేదికగా స్పందించారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. వీలైనంత త్వరగా తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ‘ జై హింద్.. జై భారత్.. వందేమాతరం’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టెమవారి పల్లెకు చెందిన ఆర్మీ జవాన్‌కు చెందిన భూమిని కొందరు కబ్జా చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు, పోలీసులు కనీసం పట్టించుకోవట్లేదు. దీంతో పలుమార్లు సెల్ఫీ వీడియోలతో భూమిని కబ్జా చేసిన ఆక్రమణదారులు, పట్టించుకోని అధికారులపై జవాన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గోడు విని, సమస్య పరిష్కరించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ను కోరారు. ‘ మన దేశం కోసం, మన భూమి కోసం, మన కోసం పోరాడుతున్న జవాన్ భూమిని కబ్జాకోరులు కబ్జా చేస్తుంటే కనీసం స్పందించరా?’ అంటూ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమితో పాటు 45 మంది భూమిని అలాగే ప్రభుత్వ భూమిని కూడా చిన్నప్పగారి రెడ్డప్ప, లక్ష్మణగారి అంజప్ప, బోడె రెడ్డప్ప అనే కబ్జాకోరులు ఆక్రమించారని గత నాలుగైదు నెలలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా అధికారులు పట్టించుకోలేదు. పైగా కబ్జాదారులకే తహసీల్దార్ మద్దతుగా ఉంటున్నారని జవాన్ తెలిపారు. ఇంత జరుగుతున్నా కనీసం పోలీసులు అయినా పట్టించుకున్నారా? అంటే ఆ పాపానే పోలేదు. దీనిపై హైకోర్టులో కూడా జవాన్ సోదరుడు మోహన్ పిల్ వేశాడు. కేసు కోర్టులో ఉన్నా సరే కబ్జా భూమిపై ఆక్రమణదారులు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు.. దీనిపై వెంటనే స్పందించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని జవాన్ కోరారు.
ఈ సమస్యా చూడండి..
‘ కోనసీమ 400 కేవీ లైన్ పనులు మా పొలం మీదుగా వద్దు’ అంటూ సత్యవరపు నారాయణ అనే జవాన్ రాసిన లేఖ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక మిలిటరీ జవాను స్వయంగా రిక్వెస్ట్ చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని, కక్షగట్టి మరీ పనులు ప్రారంభించారని లేఖలో జవాన్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలం పలివెల వ్యవసాయ భూముల్లో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తన పొలంలో 400 కేవీ ఎలక్ట్రిల్ లైన్ వెయ్యద్దు అని రిక్వెస్ట్ చేశారు.
సర్, మరి ఈ జవాను రిక్వెస్ట్ ? …
"కోనసీమ 400 కేవ్ లైన్ పనులు మా పొలం మీదుగా వద్దు"
ఒక మిలిటరీ జవాను స్వయంగా రిక్వెస్ట్ చేసినా
(భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తన పొలంలో 400KV
ఎలెక్ట్రిల్ లైన్ వెయ్యద్దు అని రిక్వెస్ట్ చేసినా కూడా
కక్షగట్టి పనులు ప్రారంభించిన అధికారులు ఇప్పుడు
జై… pic.twitter.com/L9hRYgFBLS— V.Ganapathi Rao (@GanapathiChinni) May 11, 2025
Read Also- Indian Soldier Plea: పవన్ కళ్యాణ్.. ఈ జవాన్ బాధ కాస్త పట్టించుకోండి సార్!