Chandrababu: డాక్టర్ సమరం.. బహుశా ఈ పేరు తెలియని వారుండరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఢిల్లీ నుంచి యావత్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే ఆడ, మగ అనే తేడాలేకుండా ఎవరికి ఎలాంటి శృంగార సందేహాలు ఉన్న సరే ఎంతో ధైర్యంగా బహిరంగంగా చిటికెలో శృంగార సందేహాలు తీర్చేస్తుంటారు. అందుకే కుర్రాళ్ళ నుంచి పండు ముసలోళ్ల వరకు ప్రతి ఒక్కరికి ఈ సమరం తెలుసు. అయితే ఆయన జీవితంలో అన్నీ సుఖాలు, విజయాలే కాదు.. ఎన్నో కష్టాలు, అంతకుమించి చీకటి రోజులు కూడా ఉన్నాయి. ఆ చీకటి రోజులను గుర్తు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఒక ఉదాహరణగా వివరించారు. బుధవారం ‘ఎమర్జెన్సీకి (Indian Democracy) 50 ఏళ్ళు పూర్తి’ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంచి రోజులే కాదు చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకుంటేనే ఏది మంచి.. ఏది చెడో అనే తెలుసుకుంటామన్నారు. ‘ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం. దేశంలో ఎన్నో మలుపులు సవాళ్లు, విజయాలు చూశాయి. ప్రజాసౌమ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం (India). అత్యవసర పరిస్థితి అనేది చీకటి రోజులు. సమరంతో పాటు నారాయణవి కూడా చీకటి రోజుల అనుభవాలే. 1975 జూన్ 25 ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ప్రజలందరికి ఆనాటి అత్యవసర పరిస్థితి తెలియచేయాలని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ప్రజల ప్రాధమిక హక్కులని కాలరాశారు. అలహాబాద్ హైకోర్టులో ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపించవచ్చు. కానీ, అహంకార ధోరణితో అత్యవసర పరిస్థితి విధించి ఎంతో విద్వంసం సృష్టించారు. కుటుంబ నియంత్రణను సైతం బలవంతంగా చేశారు. బలవంతంగా ఆపరేషన్స్ చేసి జనాలను అనేక ఇబ్బందులకు గురిచేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ఆ స్ఫూర్తితో పని చేయటం మనందరి బాధ్యత’ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో సమరం (Dr Samaram) కూడా పాల్గొన్నారు.
Read Also- Kayadu Lohar: ‘పిక్కలు చూశావా.. భయ్యా’.. డైలాగ్ చెప్పకుండా ఉండగలరేమో ట్రై చేయండి!
నాడు.. నేడు..!
‘ 1984 ఆగస్టులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. అమెరికాలో గుండె ఆపరేషన్ చేపించి ఇంటికి వస్తే ఎన్టీఆర్ (NTR) ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లి ఎన్టీఆర్ విజయం సాధించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ 2019-24లో ఒక ముఖ్యమంత్రిగా పని చేసి ప్రజలందరిని ఇబ్బందులకు గురిచేశారు. అన్యాయం, అవినీతి, కబ్జాలు, రౌడీయిజం, ఎవరు గొంతు విప్పినా గొంతు నులిమే పరిస్థితిలో గత పాలకులు పాలించారు. మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడాలనే ద్యేయంతో మిత్రుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , బీజేపీతో కూటమి కలిసి మంచి విజయాన్ని సాధించాం. విధ్వంసం నుంచి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడి పునర్‌నిర్మిస్తామని ప్రజలందరికి హామీ ఇచ్చాం. భారతదేశం ఒక గొప్ప దేశం. కొంత మంది చెడు చేసినా అది శాశ్వతం కాకుండా దేశం చూసుకుంది. ఇప్పుడున్న యువత ఎమర్జెన్సీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ప్రధానిగా మోదీ (Modi) ఉండటం మన అదృష్టం. సరైన సమయంలో సరైన నాయకత్వం దేశానికి ఉంది’ అని ప్రధానిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
నేటికి ఆరేళ్లు..
‘ దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసింది. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు తెరలేపింది. అయితే ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని, రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారు. కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారు. అందుకే ఒక కసి, పట్టుదలతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని.. మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దాం’ అని ఎక్స్ వేదికగా చంద్రబాబు పిలుపునిచ్చారు.
Read Also- YSRCP: సీన్ రివర్స్.. టీడీపీ నుంచి వైసీపీలోకి కీలక నేత
మార్గదర్శుల సంఖ్య పెంచాలి
మరోవైపు.. జీరో పావర్టీ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 విధానంపై అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. మార్గదర్శుల గుర్తింపు, బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సమీక్షించారు. పీ4 విధానంలో మేలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19,15,771 బంగారు కుటుంబాలను గుర్తించగా వారిలో ఇప్పటి వరకు 87,395 కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని అధికారులు వివరించారు. సమాజంలో చాలామంది ఏదో ఒక రూపంలో పేదలకు సాయం చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారికి పీ4ను వేదికగా మార్చాలని సీఎం అన్నారు. మార్గదర్శకులుగా ఉండేవారిని సంప్రదించేందుకు.. బంగారు కుటుంబాలను వారితో అనుసంధానం చేసేందుకు మరింత ఎక్కువ దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం మానిటరింగ్ చేసేందుకు కాల్ సెంటర్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. మార్గదర్శకులుగా ఉండాలనుకునే వారికి అసవరమైన సమాచారాన్ని, గైడెన్స్ ఇచ్చేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మార్గదర్శలతో బంగారు కుటుంబాలను అనుసంధానించిన తరవాత.. అంతకుముందు వారి పరిస్థితి, బంగారు కుటుంబంగా ఎంపికైన తరువాత వారి జీవన ప్రమాణాలను తెలుసుకునేందుకు సర్వేలను కూడా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. కార్యక్రమం అమలుపై విధిగా ఆడిటింగ్ నిర్వహించడం, మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం, పీ4 ప్రభావాన్ని నివేదకల ద్వారా ఎప్పటికప్పుడు మార్గదర్శకులకు కూడా అందించాలన్నారు.
Read Also- YS Jagan: చంద్రబాబుకు ఝలక్ ఇవ్వబోతున్న వైఎస్ జగన్!