Laddu Adulteration Case: సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ అధికారులు మరో ఛార్జ్‌షీటు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏఆర్ డెయిరీ, బోలే బాబా, వైష్ణవి డెయిరీ నిర్వాహకులను సిట్ అరెస్ట్ చేసిన విషయం విధితమే. అయితే తొలి ఛార్జ్‌షీట్ తర్వాత సీబీఐ బృందంలోని సిట్ అధికారులు రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు.
తొలి దశలో పాత్రధారులను అరెస్ట్ చేయగా ఇప్పుడు రెండో దశలో సూత్రధారులపై సీబీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలను మార్చడంపై పూర్తి దర్యాప్తు కొనసాగనుంది. మరోవైపు వైసీపీ హయాంలోని టీటీడీ పాలక వర్గానికి చెందిన కొందరు సభ్యులు, అధికారుల పాత్రపై ఇప్పటికే సిట్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రెండో దశ దర్యాప్తులో ప్రధానంగా వీరిపైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.
Also read: Lemon: సమ్మర్ ఎఫెక్ట్.. కొండెక్కిన నిమ్మకాయలు.. బాబోయ్ మరీ అంతనా!