Case on Minister Son: మంత్రి సంధ్యరాణి కొడుకుపై కేసు.. కారణం
Sandhya-Rani (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Case on Minister Son: మంత్రి సంధ్యరాణి కొడుకు, పీఏలపై కేసు.. పార్వతీపురం ఎస్పీ కీలక ఆదేశాలు

Case on Minister Son: కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యరాణి కొడుకు పృథ్వీపై కేసు నమోదయింది. మంత్రి పీఏ సతీష్‌పై కూడా సాలూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడంతో పాటు, తనను వేధింపులకు గురి చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పార్వతీపురం మన్యం ఎస్పీ స్పందించారు. త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ సాలూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

పీఏ సతీష్ రాజీనామా

జాబ్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేయడంతో పాటు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రికి తన రిజైన్ లెటర్ పంపించారు. కాగా, కారుణ్య నియామకాల విషయంలో తనను సతీశ్ వేధింపులకు గురిచేశాడని, ఈ వ్యవహారంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదంటూ బాధిత మహిళ చెబుతోంది. ఈ క్రమంలోనే పీఏ సతీష్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీపై వేధింపుల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన మహిళ, పృథ్వీ మధ్య జరిగిన చాటింగ్ ఇదేనంటూ కొన్ని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also- Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

 

Just In

01

MLA Defection Case: మలుపు తిరిగిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు..?

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదు: కేటీఆర్

Nitin Nabin Sinha: ఆశావహుల ఆశలపై నీళ్లు.. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా నితిన్‌ నబీన్‌ సిన్హా..?

CM Revanth Reddy: దావోస్‌లో తెలంగాణ విజన్.. రైజింగ్ 2047ను ప్రదర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Drinking Water: జలమండలి ప్రత్యేక వ్యూహం.. రేపటికోసం కాస్త ముందుగానే కళ్లు తెరిచిన వాటర్ బోర్డ్!