Bus Accident | కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కు ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఏడుగురు మృతి చెందారు. ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లిన బస్సు తిరుగు ప్రయాణంలో.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. నేషనల్ హైవే–30 మీద సిహరో వద్ద బ్రిడ్జి మీద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఢీకొనడంతో బస్సు (Bus Accident) నుజ్జు నుజ్జు అయింది. స్పాట్ లో ఏడుగురు చనిపోగా.. 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన జరిగిన వెంటనే జబల్ పూర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. మృతులు అందరూ ఏపీకి చెందిన వారేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
