AP Liquor Scam: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం అంశం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్కామ్ దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు.. ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి (Raj Kasi Reddy) ఇటీవలే అరెస్ట్ చేశారు. అతడికి కోర్ట్ 15 రోజుల రిమాండ్ విధించడంతో విజయవాడ జిల్లా జైలు (Vijayawada District Jail)లో ఉంచి విచారణ జరుపుతున్నారు. అయితే ఈ మద్యం స్కామ్ (Liquor Scam)కు సంబంధించి తాజాగా ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ఈ స్కామ్ వెనక ముంబై నటి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరా ముంబయి నటి?
వైసీపీ హయాం (Ex TCP Govt)లో జరిగిన మద్యం స్కామ్ పై దర్యాప్తును సిట్ (SIT) అధికారులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఈ కుంభకోణం వెనకున్న వ్యక్తులు.. ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తున్నారు. ఇటీవల కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. ఆ తర్వాత A-8గా ఉన్న బూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ముంబయి నటి ప్రమేయమున్నట్లు అధికార టీడీపీ తన ఎక్స్ ఖాతాలో సంచలనం పోస్ట్ పెట్టింది. ‘ఏపీ లిక్కర్ స్కాంలో విస్తుపోయే నిజాలు.. ఎవరా ముంబై హీరోయిన్? ఎవరా ఇద్దరు నేతలు?’ అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియా ఖాతా కావడంతో నిజంగానే ఈ స్కామ్ వెనక ముంబయి నటి హస్తమున్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు.
ఏపీ లిక్కర్ స్కాంలో విస్తుపోయే నిజాలు..
ఎవరా ముంబై హీరోయిన్ ? ఎవరా ఇద్దరు నేతలు ?#LiquorScamByJagan#ScamsterJagan#YCPScams#PsychoFekuJagan#AndhraPradesh pic.twitter.com/zjs4nwfXUb— Telugu Desam Party (@JaiTDP) April 24, 2025
ముంబయి నటీమణుల ప్రభావం
గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో ముంబయి నటీమణుల పేర్లు గణనీయంగా వినిపిస్తున్నారు. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ (Kadambari Jethwani) వేధింపుల విషయం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో నటిని వేధించిన కేసులో తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు (PSR Anjaneyulu)ను ఏపీ సీఐడీ (AP CID) అరెస్ట్ చేసింది. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిల్ పై ఉన్నారు. త్వరలో వారి అరెస్ట్ కూడా ఉంటుందని ప్రచారముంది. ఈ తరుణంలో మరో ముంబై నటి ప్రస్తావన.. లిక్కర్ స్కామ్ లో బయటకు రావడం సంచలనం రేపుతోంది.
జగన్ అరెస్ట్ తప్పదా?
మరోవైపు మద్యం కుంభకోణం అంశానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ రాజ్ కేసిరెడ్డేనని ఇటీవల విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిట్ దర్యాప్తులో ఈ కుంభకోణం వెనక జగన్ (YS Jagan) ఉన్నట్లు తేలిందని ప్రచారం జరుగుతోంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతీ నెల రూ.50-60 కోట్లు మేర ముడుపులు వసూలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆ సొమ్మంతా జగన్ వద్దకే చేర్చేవాడని సిట్ దర్యాప్తులో తేలినట్లు వార్తలు వస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య ఇలా రూ.3,200 కోట్ల మేర ముడుపులు వసూలు చేశారని సిట్ వెల్లడించింది.