Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
image credit: twittter)
ఆంధ్రప్రదేశ్

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!

Bapatla SP:  అపరిచిత లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ (Umamaheshwar)జిల్లా ప్రజలను హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో ప్రచారమయ్యే అనుమానాస్పద లింకుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

నమ్మి క్లిక్ చేయవద్దు

గత కొద్ది రోజులుగా నాకు రూ.5 వేలు వచ్చాయి, నేను మొదట నకిలీ అనుకున్నాను కానీ మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ లింకును మరో పది మందికి ఫార్వర్డ్ చేయండి అంటూ వాట్సప్ గ్రూపులలో మెసేజ్ లతో కూడిన లింకులు వస్తున్నాయని వాటిని నమ్మి క్లిక్ చేయవద్దని ఆయన కోరారు. ఇటువంటి లింకులు క్లిక్ చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.

Also Read: mHyderabad Crime: చెంగిచెర్లలో వరుస దొంగతనాలపై క్లూ సేకరించిన పోలీసులు..?

ఎస్పీ సూచనలు

వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దు. ఉచిత బహుమతులు లేదా నగదు వస్తుందనే ఆశతో మీ బ్యాంక్ వివరాలు, ఓటిపి (OTP)లను ఎవరికీ చెప్పవద్దు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి తమ వ్యక్తిగత సంచారం, నగదును రక్షించుకోవాలని ఎస్పీ సూచించారు. 

Also Read: Appi Reddy on Jagan: భద్రతపై నిర్లక్ష్యం.. సర్కారుపై ఎమ్మెల్సీ ఫైర్!

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!