Araku bandh | ఏపీ అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు అరకులో అలజడి సృష్టించాయి. ఆయన మాటలకు నిరసనగా అరకు బంద్ కు పిలుపునిచ్చాయి ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతాన్ని మొత్తం బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జిల్లా కేంద్రంలోని వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ, రేపు బంద్ కొనసాగనుంది. విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో అయ్యన్న మాట్లాడుతూ.. టూరిజం ప్రాంతాలను ఫ్రీ జోన్ చేయడం ద్వారా పెట్టుబడులు పెరుగుతాయని సూచించారు.
అదే జరిగితే 1/70 చట్టానికి ప్రమాదం అని ఆదివాసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ ఎఫెక్ట్ తో ఇంటర్ ఎగ్జామ్స్ ను అధికారులు వాయిదా వేశారు.