AP 10th Class Results: ఏపీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉదయం 10 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విడుదల చేశారు. ఈ మేరకు పదో పరీక్ష ఫలితాలకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈసారి వాట్సాప్ లోనూ ఫలితాలను అందుబాటులోకి వచ్చాయి.
పరీక్షకు హాజరైన విద్యార్థులు
ఈ ఏడాది మొత్తం 6,19,275 మంది రెగ్యులర్ స్టూడెంట్స్ పదో తరగతి పరీక్షలు రాశారు. వారిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది స్టూడెంట్స్ పరీక్షలు హాజరుకాగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
పాస్ శాతం ఇలా..
ఈ ఏడాది మెుత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,98,585 మంది పాస్ అయినట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లాల పరంగా చూస్తే పార్వతిపురం మన్యం జిల్లా.. 93.90% ఉత్తీర్ణతతో టాప్ లో ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 1,680 పాఠశాలలో 100% పాస్ పర్సంటేజ్ ను సంపాదించాయని తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ సందర్భంగా లోకేష్ అభినందనలు తెలియజేశారు.
📢 The SSC Public Examinations results for March 2025 have been announced. 📢
This year, out of 6,14,459 students who appeared, 4,98,585 have passed, achieving a pass percentage of 81.14%👏👍🏻. I'm delighted to see that Parvathipuram Manyam district has topped the list with an…
— Lokesh Nara (@naralokesh) April 23, 2025
రెండో ఛాన్స్ ఉంది
పరీక్షల్లో ఫెయిలైన వారు బాధపడవద్దని రిజల్ట్స్ విడుదల సందర్భంగా నారా లోకేష్ సూచించారు. జీవితంలో ఒక్కరికీ రెండో ఛాన్స్ ఉంటుందని స్పష్టం చేశారు. మే 19 నుంచి 28 తేదీల మధ్య సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఫలితాలను ఎలా చూసుకోవాలంటే?
పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ వెబ్ సైట్లలో చూసుకోవచ్చు. ‘మన మిత్ర’ (వాట్సాప్), LEAP మొబైల్ యాప్ లలో కూడా అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను ఎంటర్ చేసిన తర్వాత వారి ఫలితాలు కనిపిస్తాయి. అలాగే, దీనిని డౌన్లోడ్ చేసుకుని PDF కాపీ రూపంలో కూడా పొందవచ్చు. అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. అలాగే.. పదో తరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షలతో పాటు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలను ఈ https://apopenschool.ap.gov.in/ లింక్ పై క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు.