Home Minister Anitha: కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) చేసిన వ్యాఖ్యలకు ఇవాళ హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యలు చేశారు.
కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందంటూ వైసీపీ (YCP) నేత గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. తమ కూటమిలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని, ముందు వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలన్నారు. అదేవిధంగా పోసాని అరెస్టు పై స్పందించిన ఆమె…ఇక నుంచి నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతామంటే కుదరదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోసాని పై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం క్షక్షపూరిత రాజకీయాలు చేయడం లేదన్నారు. గతంలో మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై పోసాని చేసిన వ్యాఖ్యలు క్షమించ రానివని కామెంట్ చేశారు.
కాగా, కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని వైసీపీ నేత గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూటమి నేతలు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా గోరంట్ల మాధవ్ వ్యవహరించారని ఆ ఫిర్యాదులో వివరించారు.