Suneel Kumar : ఏపీ ప్రభుత్వం సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ కు భారీ షాక్ ఇచ్చింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సునీల్ కుమార్ పేరు ఏపీ రాజకీయాల్లో ఎంతగా వినిపించిందో మనకు తెలిసిందే. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును (Raghurama Krishnam Raju) వేధించారంటూ ఈయన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి.
గతంలోనే ఆయన మీద పలు కేసులు కూడా వేశారు. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా ఇష్టం వచ్చినట్టు సెలువులు పెడుతూ విదేశాలకు వెళ్తున్నారని. . ఐపీఎస్ రూల్స్ ను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకుంది. 2020 నుంచి 2024 మధ్యలో ఆయన చాలా సార్లు పర్మిషన్ లేకుండానే సెలవులు పెట్టేసి విదేశాలకు వెళ్లారు.
అప్పట్లో ఆయన తీరుపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఆయన రూల్స్ ను ఉల్లంఘించారంటూ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంది. అయితే రఘురామకృష్ణంరాజును వేధించారనే ప్రధాన ఆరోపణలే ఆయన సస్పెన్షన్ కు దారి తీశాయనే వాదనలు కూడా ఉన్నాయి. సునీల్ కుమార్ ను వదిలిపెట్టను అంటూ ఎన్నోసార్లు రఘురామ చెప్పిన సంగతి తెలిసిందే.