AP Constable Recruitment: ఆంధ్రప్రదేశ్ లోని కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షా తేదీని ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ తాజాగా ప్రకటించింది. కానిస్టేబుల్ ఎంపికకు సంబంధించి జూన్ 1న తుది పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష జరగనున్నట్లు తెలిపింది.
పరీక్షా కేంద్రాలు
ఏపీలోని ఐదు ప్రధాన నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ (AP Police Recruitment Board) తాజాగా ప్రకటించింది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దేహదారుడ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన మెుత్తం 38,910 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించినట్లు చెప్పింది.
Also Read: Pahalgam Terror Attack: సీఎం సంతాపం.. క్యాండిల్ ర్యాలీ సైతం వాయిదా.. ఏమైందంటే?
దేహదారుడ్య పరీక్షలు
కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు గతేడాది డిసెంబర్ 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 మధ్య ఈవెంట్స్ నిర్వహించారు. మెుత్తం 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో ఈవెంట్స్ జరపగా.. 95,208 మంది హాజరయ్యారు. అందులో 38,910 మంది ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ కు అర్హత సాధించారు.
2022లో నోటిఫికేషన్
కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 2022 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదలైంది. మెుత్తం 6100 పోస్ట్ లకు గానూ ఏకంగా 4,59,182 మంది అభ్యర్థులు అప్లై చేశారు. వీరికి 2023 జనవరిలో ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో 95,208 మంది దేహదారుడ్య పరీక్షలకు అర్హత సాధించారు. వారందరికీ ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించగా 38,910 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. మెయిన్స్ ఎగ్జామ్స్ ను ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు నిర్వహించనున్నారు. అందులో మెరుగైన మార్కులు సాధించిన వారిని రిజర్వేషన్ అంశాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.