AP CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైనా మేధావి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి (Nobel Prize) సాధిస్తే, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్షరాలా రూ. 100 కోట్ల నగదు బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రకటించారు. 2017లోనే ఆయన ఈ సవాల్ విసిరారు. అప్పట్లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్) ప్రారంభోత్సవంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన అదే మాట చెప్పారు. మంగళవారం అమరావతిలో వేలాది టెక్ విద్యార్థులతో ఆన్‌లైన్‌లో ‘క్వాంటమ్ టాక్’ (Quantum Talk Amaravati) నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే.. వారికి రూ. 100 కోట్ల రివార్డ్ అందిస్తానని అన్నారు. గతంలోనే ఈ మాట చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని అన్నారు.
Also Read- The Rise Of Ashoka: ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ ఎలా ఉందంటే?
ఇకపై అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి..
‘క్వాంటమ్‌కు చెందిన ఎంతోమంది నోబెల్ బహుమతిని తీసుకున్నారు. ఇక్కడి యంగ్ బ్రెయిన్స్, మేధావి వర్గం, ఐటీ ప్రొఫెషనల్స్ ఎందుకు ట్రై చేయకూడదని నేను అడుగుతున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నించండి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము అందిస్తాం. ఆ స్థాయికి మేము ప్రీపేర్ చేస్తాం. నోబెల్ వస్తే రూ. 100 కోట్లు ఇస్తాము. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నా కోరిక’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘క్యుబిట్, వైసర్ సంస్థలతో కలిసి ప్రభుత్వం వేలాది టెక్ విద్యార్థులతో ఆన్ లైన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో నా విజన్ చెప్పాను. పాతిక, ముప్పై ఏళ్ళ క్రితం ఐటీ గురించిన చెప్పిన నేను ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు ఎవరికి ఏ వినూత్నమైన ఆలోచన వచ్చినా సిలికాన్ వ్యాలీకి వెళ్లి దాన్ని సాకారం చేసుకునేవారు. కానీ ఇకపై ప్రపంచంలోని వారంతా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి రానున్నారు’ అని చెప్పారు.
Just as Silicon Valley shaped the digital age, Amaravati’s Quantum Valley will anchor the deep tech economy of the future. Delighted to step into the classroom and interact with students of the WISER–Qubitech–QKrishi quantum programme, the world’s largest. Proud that AP is… pic.twitter.com/iVcD10k9E0
— N Chandrababu Naidu (@ncbn) December 23, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

