ap-budjet
ఆంధ్రప్రదేశ్

AP Budget: ఏపీ బడ్జెట్ రూ. 3.22 లక్షల కోట్లు; అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యావుల

AP Budget: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను రూపొందించింది. ఇందులో రెవిన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్లు అని, అలాగే మూలధన వ్యయం అంచనా రూ. 40,635 కోట్లు అని మంత్రి పయ్యావుల వివరించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. … గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. కొత్త పెట్టుబడులు రాకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఇటువంటి సవాళ్లను అధిగమించడంలో చంద్రబాబు ఆయననకు ఆయనే సాటి అని కొనియాడారు.

బడ్జెట్ లో కీలక కేటాయింపులు..
రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయానికి రూ.48వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కోసం రూ.6,300 కోట్లు, పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్‌లో రూ.6,705 కోట్లు కేటాయించారు.

తల్లికి వందనం

అదేవిధంగా తల్లికి వందనం పథకం పై ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 1-12 చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తిస్తుందని చెప్పారు. కాగా తల్లికి వందనం  పథకానికి గానూ బడ్జెట్ లో రూ.9,407 కోట్లను కేటాయించారు.  గత ప్రభుత్వం పాఠశాల విద్యా పట్ల దుర్మార్గంగా వ్యవహరించిందని మంత్రి ఆరోపించారు. ఆ నిర్లక్ష్యానికి మూల్యంగా దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను తిరిగి గాడిన పడేసే బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తీసుకున్నారన్నారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టామని, నేటి బాలలే రేపటి పౌరులు అనే భావనతో రిజల్ట్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించామని తెలిపారు.

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?