Ananthapur: ఏ తల్లి చేయని పని ఇది. ఏ కష్టం వచ్చిందో కానీ, నా వల్ల కాదు. నేను ఈ బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వలేనని ఆ తల్లి భావించింది. ఏకంగా నడిరోడ్డులో ఆ బిడ్డను వదిలివేసి వెళ్లింది. ఈ ఘటన తెలుసుకుంటే కన్నీళ్లు రాకమానవు. ఏపీలోని అనంతపురం విజయనగర కాలనీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
తల్లి, బిడ్డ ఈ అనుబంధం గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సరిపోవు. అలాంటి బంధం ఇది. బిడ్డ ఆకలి, దాహం ముందు తెలుసుకొనేది తల్లి. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. అలాంటి తల్లి ఒడిలో పెరగాలని ఏ బిడ్డ కోరుకోడు చెప్పండి. కానీ కొందరు బిడ్డలకు తల్లి లేని లోటు ఈ లోకంలో ఉంది. కొందరికి తల్లి ఉన్నా ఆ ప్రేమ దగ్గరికి వచ్చే లోగానే, ఏదొక కారణంతో బిడ్డ కు తల్లి దూరమయ్యే రోజులు వచ్చాయి. అయితే కొందరు తల్లులు మాత్రం ఏ కష్టం వచ్చినా, నా బిడ్డ భవిష్యత్ బాగుండాలని చేసే కష్టం అంతా ఇంతా కాదు.
ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు చూస్తే, తల్లికి బిడ్డ భారమవుతుందా అనే ప్రశ్న రాకమానదు. ఈ మాటలకు తగినట్లుగానే ఏపీలోని ఆనంతపురంలో ఓ ఘటన జరిగింది. పేగు తెంచుకున్న బిడ్డను ఓ తల్లి నడిరోడ్డు మీద వదిలి వెళ్లింది. ఈ ఘటన అనంత నగరం విజయనగర కాలనీలో అర్థరాత్రి వెలుగులోకి వచ్చింది. అయితే బిడ్డను వదిలివేసిన తల్లి ఒక లెటర్ వదిలి వెళ్లడం విశేషం.
ఆ బిడ్డ అరుపులు గమనించిన స్థానికులు అక్కడికి చేరుకొని బిడ్డను తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఇంతకు ఆ లెటర్ లో ఏముందంటే.. నా బిడ్డకు మంచి భవిష్యత్ ఇవ్వలేను, నా బిడ్డకు ఎవరైనా మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆ తల్లి కోరింది.
Also Read: Deputy CM on Terror Attack: రోహింగ్యాలపై.. పవన్ సంచలన కామెంట్స్
ఆ తల్లి కోరిన కోరిక చూసి, ఆమె ఎన్ని కష్టాల్లో ఉందో, బిడ్డను ఆ తల్లి ఇలా వదిలి వెళ్ళిందని చర్చించుకున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉంది. ఈ ఘటనపై అనంతపురం వన్ టాన్ పోలీసులు ఈ విషయంపై విచారణ చేస్తున్నారు. ఏదిఏమైనా బిడ్డ భవిష్యత్ మంచిగా అందించలేనన్న ఆవేదనతో ఆ తల్లి తన బిడ్డను వదిలిందా? లేక మరే ఇతర కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.